ధనలక్ష్మీ బ్యాంక్‌ లాభం రూ.23 కోట్లు Dhanlaxmi Bank's profit is Rs 23 crore

ABN , First Publish Date - 2022-05-22T07:01:46+05:30 IST

ప్రైవేట్‌ రంగంలోని ధనలక్ష్మీ బ్యాం క్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను రూ.302.58 కోట్ల ఆదాయంపై రూ.23.42 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

ధనలక్ష్మీ బ్యాంక్‌ లాభం రూ.23 కోట్లు Dhanlaxmi Bank's profit is Rs 23 crore

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని ధనలక్ష్మీ బ్యాం క్‌.. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను రూ.302.58 కోట్ల ఆదాయంపై రూ.23.42 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గటంతో పాటు వడ్డీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండటం కలిసి వచ్చిందని పేర్కొంది. గత ఏడాది ఇదే కాలం (రూ.5.28 కోట్లు)తో పోల్చితే లాభం ఏకంగా నాలుగు రెట్లు పెరిగిందని తెలిపింది. కాగా మొత్తం ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,085.76 కోట్ల ఆదాయంపై రూ.35.90 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ నమోదు చేసింది. మార్చి ముగిసే నాటికి బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు 9.23 శాతం నుంచి 6.32 శాతానికి తగ్గగా నికర ఎన్‌పీఏలు 4.76 శాతం నుంచి 2.85 శాతానికి తగ్గాయి. 

Updated Date - 2022-05-22T07:01:46+05:30 IST