కరోనా మహమ్మారి కారణంగా గత యేడాది విడుదల కావాల్సిన అనేక చిత్రాలు ఈ యేడాది ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఈ కోవలో గత రెండు నెలల కాలంలో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకురాగా, వాటిలో నాలుగైదు చిత్రాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. ఇదిలావుంటే, ఈ యేడాది ఎక్కువగా ఇద్దరు ముగ్గురు హీరోల చిత్రాలు అధిక సంఖ్యలో విడుదలకానున్నాయి. వారిలో విజయ్ సేతుపతి, జీవీప్రకాష్, ధనుష్ ఉన్నారు. విజయ్ సేతుపతి, జీవీప్రకాష్ చిత్రాలు ఈ యేడాది ఆరేడు విడుదలకానున్నాయి.
అదేవిధంగా హీరో ధనుష్ నటించిన చిత్రాల్లో ఐదు విడులయ్యే అవకాశం ఉంది. ముందుగా, ‘జగమే తందిరమ్’ చిత్రం ఈ నెలలో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల 9న ‘కర్ణన్’ తెరపైకిరానుంది. అదేవిధంగా ధనుష్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘అత్రాంగి రే’ ఆగస్టు 6న విడుదల కానుంది. వీటితో పాటు కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించే చిత్రం, సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ‘నానే వరువేన్ ’ చిత్రాలు ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఇదికాకుండా, ఒక హాలీవుడ్ చిత్రంలోనూ ధనునష్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కోసం ధనుష్ విదేశాలకు వెళ్ళారు. ఈయన మే నెలలోనే స్వదేశానికి తిరిగిరానున్నారు. ఆ తర్వాత తాను కమిట్ అయిన రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి ఈ యేడాదిలోనే విడుదల చేసేలా ప్లాన్ చేశారు.