ఆగస్ట్ నుంచి సెట్స్‌పైకి రాబోతున్న ధనుష్ మూవీ

Jun 24 2021 @ 08:34AM

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించబోతున్న కొత్త చిత్రం ఆగస్ట్ నుంచి సెట్స్‌పైకి రాబోతోంది. సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహినున్నాడు. ఇటీవలే 'జగమే తందిరం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం 'ది గ్రే మ్యాన్' అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణలో ఉన్న ఆయన, రెండు వారాల్లో చెన్నైకి తిరిగి రానున్నాడట. చిన్న గ్యాప్ తర్వాత సెల్వరాఘవన్ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ ఓ పిక్‌ను షేర్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. ఆగష్టు 20 నుంచి షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థాను నిర్మాత. యాక్షన్ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న దీనికి 'నానే వరువెన్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ త్రిభాషా చిత్రాన్నీ ప్రకటించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.