ధనుశ్.. తెలుగులో స్ట్రయిట్ మూవీ

Jun 7 2021 @ 08:17AM

కోలీవుడ్ హీరో ధనుశ్ వైవిధ్యమైన కథా చిత్రాలు, పాత్రలతో టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్‌లో, హాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న ధ‌నుశ్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మ‌య్యాడ‌నే వార్త నెట్టింట చ‌క్క‌ర్లుకొడుతుంది. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌, స్టార్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే సినిమాలో హీరోగా న‌టించ‌మ‌ని ధ‌నుశ్‌ను సంప్ర‌దించార‌ట‌. మంచి క‌థ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామ‌ని అనుకున్న ధ‌నుశ్ కూడా వెంట‌నే ఓకే చెప్పేశాడ‌ని అంటున్నారు. వ‌చ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం. ధ‌నుశ్ హీరోగా న‌టించిన ‘జ‌గ‌మే తంత్ర‌మ్’ సినిమా ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అవుతుంది. మరో వైపు హాలీవుడ్ మూవీ ‘గ్రే మ్యాన్’ చిత్రీకరణలో ఈ తమిళ కథానాయకుడు బిజీగా ఉన్నాడు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.