తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-01-25T06:00:35+05:30 IST

నివర్‌ తుపాను వలన జిల్లాలో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

 జేసీ(రెవెన్యూ) దినేష్‌కుమార్‌


గుంటూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుపాను వలన జిల్లాలో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. తుపాను వలన అప్పట్లో 25 వేల హెక్టార్లలో ధాన్యం తడిసిందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నారు. గ్రేడ్‌-ఏ ధాన్యానికి సంబంధించి కనీస మద్దఽతు ధర క్వింటాల్‌కు రూ.1,888, కామన్‌ వెరైటీకి రూ.1,868గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని క్వింటాల్‌కి కేవలం 5 శాతం మాత్రమే తగ్గించి గ్రేడ్‌-ఏని రూ.1,784కి, కామన్‌ వెరైటీని రూ.1,775కి కొనుగోలు చేస్తామన్నారు. 

Updated Date - 2021-01-25T06:00:35+05:30 IST