ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-11-27T06:29:25+05:30 IST

ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ధాన్యం కొనుగోలులో  రైతులను ఇబ్బంది పెట్టొద్దు
తేలప్రోలు ఽధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌, ఏవో

ఉంగుటూరు, నవంబరు 26  :  ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఎలాంటి ఇబ్బందిపెట్టొదని తహసీల్దార్‌ డి.వనజాక్షి అన్నారు. మండల పరిధిలోని తేలప్రోలు, ఆముదాలపల్లి రైతుభరోసాకేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఏవో కె.హెప్సిబారాణితో కలిసి ఆమె పరిశీలించారు. సోమవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సిబ్బందిని ఆరాతీశారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల బ్యాంక్‌ఎకౌంట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రాప్‌ నమోదుతో పాటు ఈకేవైసీ చేయించుకున్న రైతులు మాత్రమే ధాన్యాన్ని విక్రయించే అవకాశమున్నందున ప్రతిరైతూ తమ పంటను ఈక్రాప్‌, ఈకేవైసీ చేయించుకునేలా చూడాలని పేర్కొన్నారు.  అవసరమైన గోనె సంచులను అందుబాటులో వుంచాలని సూచించారు.  మండలంలోని 16 ఆర్బీకే ల్లో ప్రభుత్వం ఽధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులందరూ తమ సమీపంలోని ఆర్బీకేల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని తహసీల్దార్‌ సూచించారు.  వీఏఏలు, వీఆర్వోలు, సిబ్బంది, పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T06:29:25+05:30 IST