ధర.. భారం!

ABN , First Publish Date - 2022-06-29T04:16:42+05:30 IST

ఎలాంటి లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో సరసమైన ధరలకు ప్లాట్లు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం కావలిలో చేపట్టిన జగనన్న స్మార్ట్‌టౌనషి్‌ప లక్ష్యానికి దూరంగా ఉంది.

ధర.. భారం!
కావలి శివార్లలో జగనన్న స్మార్ట్‌ టౌనసి్‌ప లేఅవుట్‌

అందనంత ఎత్తులో జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప

లే అవుట్‌లో ప్లాట్లు మార్కెట్‌ ధరకన్నా ఎక్కువే!

ఆసక్తి చూపని కొనుగోలుదారులు

కావలిలో 1,112 ప్లాట్లకు 130 బుకింగ్‌

కందుకూరులో 292కి 35 మాత్రమే!

అభివృద్ధి పనులకు రూ.కోట్లలో వ్యయం


కావలికి ఐదు కి.మీ  దూరంలో జగనన్న స్మార్ట్‌ టౌనషిప్‌ లేఅవుట్‌ వేశారు. ప్రధాన రహదారికి సుమారు అర కిలోమీటరు లోపల ఉన్న ఈ లే అవుట్‌కు ఓ వైపు కావలి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు, మరో పక్క అటవీ ప్రాంతం ఉంది. చాలా వెనుకబడిన ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్టార్ట్‌ టౌనషి్‌పలో అంకణం రూ.40వేలుగా నిర్ణయించారు. అదే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రైవేటు లే అవుట్లలో అంకణం కేవలం రూ.30వేలకే దొరుకుతోంది.


కందుకూరుకు సుమారు రెండు కి.మీ దూరంలో జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప లే అవుట్‌ వేశారు. గజం ధర రూ.6.999గా నిర్ణయించారు. అయితే, ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌ ధర రూ.5వేలు పలుకుతోంది. దీనికితోడు లే అవుట్‌లో అభివృద్ధి పనులపై నమ్మకం సన్నగిల్లడం, రెవెన్యూ డివిజనగా మొదట రద్దు చేయడం ఆ తర్వాత కుదించి కొనసాగించడం తదితర కారణాలతో ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.


కావలి, జూన 28 : ఎలాంటి లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో సరసమైన ధరలకు ప్లాట్లు అందించాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం కావలిలో చేపట్టిన జగనన్న స్మార్ట్‌టౌనషి్‌ప లక్ష్యానికి దూరంగా ఉంది. కావలికి సమీపంలోని జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద  97.16 ఎకరాల విస్తీర్ణంలో వేసిన జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప (ఎంఐజీ లేఅవుట్‌)లో 4 విభాగాలుగా 1,112 ప్లాట్లతో లేఅవుట్‌ సిద్ధం చేసింది. సుమారు రూ.100 కోట్లు ఆర్జనే లక్ష్యంగా ఇప్పటికే లేఅవుట్‌ను చదును చేసి అందులో తాత్కాలికంగా కచ్చా రోడ్లు నిర్మించారు. డీటీసీపీ కింద లేఅవుట్‌ నిర్మించి అన్ని వసతులతో ప్లాట్లు ఏర్పాటు చేసి ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో తొలుత ప్రజలు ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు.


మార్కెట్‌ ధరకాన్న ఎక్కువే


జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప లేఅవుట్‌లో ప్లాట్ల ధరలను స్థానిక మార్కెట్‌ రేట్లకన్నా ఎక్కువ నిర్ణయించారు. వాస్తవంగా అక్కడ స్థానిక మార్కెట్‌ ధర ప్రకారం అంకణం రూ.20 వేల నుంచి 25 వేల వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వం అంకణం రూ.40 వేలు ధర నిర్ణయించడంతో కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. ఆనలైన ద్వారా ప్లాట్ల బుకింగ్‌ జరగడంతో ఆనలైనలో ప్రభుత్వం గొప్పలతో చూపిన లేఅవుట్‌ను చూసి డీటీసీపీ లేఅవుట్‌ కావటంతో ఇళ్ల నిర్మాణాలకు రుణాలు వస్తాయని సుమారు 130 ప్లాట్లను బుకింగ్‌ చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ ఉండటంతో ప్లాట్లు బుక్‌ చేసుకున్న వారిలో ఎక్కువగా ఉద్యోగులే ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా లాభాపేక్షలేకుండా మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లను అందించాల్సిన ప్రభుత్వం ఇక్కడ ప్లాట్ల ధరలు చూస్తే ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. కావలికి తూర్పు వైపు పట్టణానికి దగ్గరలో ఎకరా రూ.కోటి నుంచి కోటిన్నరకు కొనుగోలు చేసిన రియల్టర్లు అంకణం రూ.50 వేలు నుంచి 60 వేలకు విక్రయిస్తున్నారు. అయితే, పట్టణానికి దూరంగా సరైన రోడ్డు వసతి లేని ప్రాంతంలో ఎకరా రూ.13 లక్షలకు ప్రభుత్వం కొనుగోలు చేసి అంకణం రూ.40వేలు నిర్ణయించిందంటే ప్రభుత్వం కూడా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందనే భావించాల్సి వస్తోది.


నాసిరకంగా లేఅవుట్‌ నిర్మాణం


ఇదిలా ఉంటే అక్కడ నిర్మించే లేఅవుట్‌ కూడా కాంట్రాక్టర్‌ నాసిరకంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడైనా లేఅవుట్‌ వేస్తే అక్కడ మట్టిని చదును చేసి దానిపై ఎత్తుగా గ్రావెల్‌ తోలుతారు. కానీ  జగనన్న స్మార్ట్‌ టౌనషి్‌ప లేఅవుట్‌లో గ్రావెల్‌ తోలకుండానే అక్కడే ఉన్న మట్టిని చదును చేసి ఆ మట్టితోనే రోడ్లను రూపొందించారు. రోడ్లను కిందనుంచి పటిష్ట పరచక పోతే ఆ తర్వాత వేసే తారు, సిమెంట్‌ రోడ్లు అనతికాలంలోనే దెబ్బతినే ప్రమాదం ఉంది.



Updated Date - 2022-06-29T04:16:42+05:30 IST