వ్యవసాయ చట్టాలను సవరించాలి

ABN , First Publish Date - 2020-12-04T05:02:23+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను సవరించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశారు. దిల్లీలోని రైతులకు మద్దుతుగా ఏరియాలోని ఓసీ-2 గనిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శణ నిర్వహించారు.

వ్యవసాయ చట్టాలను సవరించాలి
నిరసన తెలుపుతున్న అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

 రైతుల పోరాటానికి..  అఖిలపక్ష కార్మిక సంఘాల మద్దతు 

ఓసీ2 గనిలో జేఏసీ ప్రదర్శన

మణుగూరుటౌన్‌, డిసెంబరు3: నూతన వ్యవసాయ చట్టాలను సవరించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశారు. దిల్లీలోని రైతులకు మద్దుతుగా  ఏరియాలోని ఓసీ-2 గనిలో జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శణ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వై రాంగోపాల్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల మార్పు కోరుతున్న రైతులను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రహదారులను నిర్భందించడం దారణమన్నారు. ఏడు రోజులుగా రైతులు రహదారులపై ఉండి తమ నిరసనను తెలుపుతున్న కేంద్రం ప్రభుత్వం పట్ఠించుకోకపోవడం అన్యాయమన్నారు.   కార్యక్రమంలో నాయకులు ఎం లక్ష్మణ్‌రావు, నరహరి, మహివికేందర్‌, భూక్య కిషన్‌, యాకుబ్‌పాషా, హుస్సేన్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 ఇఫ్టూ ఆద్వర్యంలో ...

 రైతులు చేస్తున్న ఆందోళనకు ఇఫ్టూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు నాయకులు ఆర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం సాంబాయిగూడెంలో రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మృతి చెందిన రైతుల ఆత్మశాంతికోసం మౌనం పాటించారు.  

అశ్వారావుపేట రూరల్‌: రైతాంగానికి తీవ్ర విఘాతంగా మారిన మూడు వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆపేదిలేదని సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, రామకృష్ణ, గోఖినేపల్లి ప్రభాకర్‌ అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మూడు పార్టీ ఆధ్వర్యంలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పిట్టల అర్జున్‌, గాండ్లగూడెం ఎంపీటీసీ బుచ్చిరాజు, రఫీతో పాటు పలువురు పాల్గొన్నారు. 

దుమ్ముగూడెం: ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మండలంలోని ములకపాడు అడ్డరోడ్డు ప్రధాన రహదారిపై సీపీఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా కార్పోరేటు కంపెనీలకు అనుకూలంగా చట్టాలు చేసిందని నాయకులు విమర్శించారు. కార్యక్రమం లో నాయకులు జిపద్మ, మర్మం చంద్రయ్య, వంశీకృష్ణ, చిలకమ్మ, రాజమ్మ, రాంమోహన్‌రెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:02:23+05:30 IST