ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-30T04:14:17+05:30 IST

ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు.

ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
సర్పంచ్‌ లావణ్య శ్రీనివా్‌సరెడ్డి దంపతులను సన్మానిస్తున్న కలెక్టర్‌ హన్మంతరావు

సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు

జిన్నారం, జూలై 29 : ధరణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. గురువారం జిన్నారం తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ రికార్డులను పరిశీలించారు. ధరణికి సంబంధించి తహసీల్దార్‌ దశరథకు పలు సూచనలు చేశారు. రికార్డుల  నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందుతాయన్నారు. అనంతరం జిన్నారంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాన్ని సందర్శించారు. స్థానిక పల్లెవనం జిల్లాకే ఆదర్శమని సర్పంచ్‌ లావణ్య శ్రీనివా్‌సరెడ్డిని అభినందించారు. పల్లెవనంలో ఏర్పాటుచేసిన బుద్ధుడి విగ్రహం, ఔషధ మొక్కలు, వివిధరకాల పూలు, కూరగాయల మొక్కలను పరిశీలించారు. అనంతరం సర్పంచ్‌ లావణ్యశ్రీనివా్‌సరెడ్డి దంపతులను శాలువాతో కలెక్టర్‌ సన్మానించారు. కాగా జిల్లాలో  647 శ్మశానవాటికలు 743 గ్రామాల్లో పల్లెవనాలు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ దశరథ, ఉపసర్పంచ్‌ సంజీవ, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:14:17+05:30 IST