అధికారంలోకి రాగానే ధరణి రద్దు

ABN , First Publish Date - 2022-07-06T05:34:28+05:30 IST

అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య అన్నారు.

అధికారంలోకి రాగానే ధరణి రద్దు
సమావేశంలో మాట్లాడుతున్న పొదెం వీరయ్య

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు

డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య

అశ్వారావుపేట, దమ్మపేటలో విస్తృత పర్యటన

దమ్మపేట/ అశ్వారావుపేట, జూలై 5: అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య అన్నారు. మందలపల్లిలో  రైతు డిక్లరేషన్‌ సమావేశం జరిగింది. కార్యక్రమానికి హజరైన వీరయ్య మాట్లాడుతు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అధికారంలోకి రాగానే రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడంతో పాటు ఽధరణిని రద్దు చే స్తామన్నారు. పోడుభూముల సమస్యను పరిష్కరించటం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మునిగిపోయే పడవని అన్నారు. కార్యక్రమంలో  సత్యప్రసాద్‌, మొగళ్ల పు చెన్నకేశవరావు, తాండ్ర ప్రభాకరరావు, కందుల వెంకటేశ్వరరావు, చిలకా శ్రీను, వగ్గెల పూజ, భారతి పాల్గొన్నారు.

తాటి రాకపోవడంపై చర్చ

కాంగ్రెస్‌ పార్టీలోకి ఇటీవలే చేరిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే స్ధానికంగానే ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవటంతో కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. తాటి సమావేశానికి రాకపోవడంతో  కారణం ఏమిటని పలువురు ఆరా తీశా రు. కాగా సమావేశానికి సంబంధించి తాటికి ఆహ్వానం అందలేదని సమాచారం.  

రామన్నగూడెం గిరిజనులకు పరామర్శ

అటవీఅధికారుల దాడుల్లో గాయపడిన రామన్నగూడెం గిరిజనులను డీసీసీ అధ్యక్షుడు వీరయ్య మంగళవారం పరామర్శిం చారు. అనంతరం అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓబీసీ మండలాల అధ్యక్షులకు నియామకపత్రాలను అం దజేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2023లో 79 సీట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. రా ష్ట్రంలో ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెపుతారన్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెన్నకేశవరావు, రాంబాబు, ఎంపీటీసీ భారతి, బూసి పాండు, దంజూ నాయక్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు పాషా పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T05:34:28+05:30 IST