ధరణి పోర్టల్‌ షురూ

ABN , First Publish Date - 2020-10-30T10:30:46+05:30 IST

భూ యాజమాన్య హక్కుల నమో దులో పారదర్శకత.. వివాదాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకువ చ్చింది.

ధరణి పోర్టల్‌ షురూ

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రారంభమైన ‘ధరణి’

తహసీల్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ 

ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే


కామారెడ్డి, అక్టోబరు 29 : భూ యాజమాన్య హక్కుల నమో దులో పారదర్శకత.. వివాదాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకువ చ్చింది. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను ప్రారంభించా రు. ఇక నుంచి వ్యవసాయ భూములను తహసీల్దార్‌ కార్యాల యాల్లో, ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా ల్లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న సబ్‌ రిజిస్టార్‌ కార్యాల యాలు కేవలం వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకే పరిమితం కానున్నాయి.


ఆగిపోయిన రిజిస్ట్రేషన్లకు మోక్షం

నూతన రెవెన్యూ చట్టం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఆగస్టు 27వ తేదీ నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేసిం ది. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను కేవలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే చేశారు. ప్రస్తుతం వ్యవ సాయ భూములను తహసీల్దార్‌ కార్యాలయంలో చేస్తుండగా, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ మాత్రం సబ్‌ రిజిస్ట్రార్‌ కా ర్యాలయంలో చేయనున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోని సి బ్బందికి సైతం ఇప్పటికే శిక్షణ అందించడంతో పాటు అన్ని రకా ల సామగ్రిని సమకూర్చారు. దసరాకు అన్ని మండలాల్లో రిజిస్ట్రే షన్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావి ంచినప్పటికి ధరణి వైబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు నెలకొనడం తో మరింత ఆలస్యమైంది. అయితే, రిజిస్ట్రేషన్‌లు ఆగిపోవడంతో క్రయవిక్రయాలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం వ్యవసాయభూము ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవడంతో త్వరలోనే  వ్యవసాయే తర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానునడడంతో రెండు నెల లుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌లకు మోక్షం కలిగినట్లయింది.


పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌

గతంలో వ్యవసాయ భూములు కోనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చేయించుకుని డాక్యుమెంట్‌ వచ్చి న తర్వాత మీ-సేవ కేంద్రాల నుంచి తహసీల్దార్‌కు మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసేవారు. నిర్ణీత గడువులో భూమి అమ్మిన వా రికి నోటీసులు జారిచేసి వారి అభిప్రాయం తీసుకుని పట్టా మా ర్పు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రిజి స్ట్రేషన్‌, మ్యూటేషన్‌ చేసే అధికారి ఒక్కరే. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన ప్పుడే ఇష్టపూర్వకంగా విక్రయించావా? సొమ్ము పూర్తిగా ముట్టిం దా? అని అమ్మినవారిని ప్రశ్నించి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. పది నిమి షాల్లో మ్యూటేషన్‌ చేసి భూమి కొనుగోలు చేసిన వారికి పట్టాదా రు పాస్‌ పుస్తకం అందిస్తారు. లేదంటే పోస్ట్‌లో ఇంటికే పంపించే లా నిబంధనలు రూపొందించారు.


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం

ధరణి పోర్టల్‌ ద్వారా మండలాల్లో వ్యవసాయ భూముల రి జిస్ట్రేషన్‌ సేవలు అం దనుండగా, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రం గు రువారం నుంచి ఇళ్లు, ఇళ్లస్థ లాలు, ఇతర చర, స్తిరాస్థుల రిజిస్ట్రేషన్లపై సందిగ్ధం నెల కొంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌ పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడం వల్లనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలి సింది.


వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం- యాదిరెడ్డి, అదనపు కలెక్టర్‌, కామారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం లో భాగంగా ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేసి గురువారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా  ప్రారంభించడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూ ములు రిజిస్ట్రేషన్‌లు జరగనున్నాయి. ఇక నుం చి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు మాత్రమే తహసీల్‌ కార్యాలయాల్లో జరుగుతాయి. వ్యవసా యేతర భూములు, భవనాలు మాత్రం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరగనున్నాయి.

Updated Date - 2020-10-30T10:30:46+05:30 IST