ధరణి సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-28T05:54:01+05:30 IST

ధరణీలో వచ్చే సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ రవి సూచించారు.

ధరణి సమస్యలను పరిష్కరించాలి
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రవి.

అవగాహన సమావేశంలో కలెక్టర్‌ రవి. 

మేడిపల్లి, సెప్టెంబర్‌ 27: ధరణీలో వచ్చే సమస్యలను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ రవి సూచించారు. మేడిపల్లిలోని మండల పరిషత్‌ కార్యలయంలో ధరణీ పోర్టర్‌ గురించి మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకొని ధరణీ పోర్టర్‌లో మార్పు కాకుంటే ఆ పట్టాను మా ర్చుకోవచ్చని తెలిపారు. పట్టాదారుడు మరణిస్తే తర్వాత వారి కుటుంబంలోని వారికి వారసత్వం ద్వారా వచ్చే వ్యవసాయ పట్టా, అసైన్డ్‌ భూముల ను విరాసత్‌ చేసుకోవచ్చని కలెక్టర్‌ సూచించారు. పలు ఆంశాలపై స ర్పం చ్‌, ఎంపీటీసీలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉమా దేవి, అదనపు కలెక్టర్‌ లత, ఆర్డీవో వినోద్‌, తహసీల్దారు బషీరోద్దిన్‌, డిటి కిరన్‌కుమార్‌, ఆర్‌ఐ నగేష్‌, ప్రజా ప్రతినధులు, అధికారులు పాల్గోన్నారు. 

 

Updated Date - 2022-09-28T05:54:01+05:30 IST