ఈ నెల 27న ‘సంపూర్ణ ముద్ర విజ్ఞాన్’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2021-06-17T22:56:35+05:30 IST

ముద్రల నిపుణులు ధరణీ ప్రగడ ప్రకాశరావు రచించిన ‘సంపూర్ణ ముద్ర విజ్ఞాన్’ ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 27న ఆన్ లైన్ వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల

ఈ నెల 27న ‘సంపూర్ణ ముద్ర విజ్ఞాన్’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్: ముద్రల నిపుణులు ధరణీ ప్రగడ ప్రకాశరావు రచించిన ‘సంపూర్ణ ముద్ర విజ్ఞాన్’ ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ నెల 27న ఆన్ లైన్ వేదికగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరగనుంది. కోవిడ్ కారణాలతో పుస్తకావిష్కరణను ఆన్ లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ముద్రలకు ప్రాచూర్యం కల్పించిన ఘనత ధరణీ ప్రగడకు దక్కుతుంది. వీరు గతంలో ఆయన రాసిన ‘ముద్రలు బంధాలు’ తెలుగు పుస్తకం పాఠక లోకంలో మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆయన ముద్రలపై ఇంగ్లీషులో ‘సంపూర్ణ ముద్ర విజ్ఞాన్’ అనే పేరుతో పుస్తకం తెస్తున్నారు. తెలుగువారికే కాక ప్రపంచవ్యాప్తంగా ముద్రలను యోగసాధకులకు అందజేయాలనేది తన తపన అని ధరణి ప్రగడ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జూమ్‌లో వీక్షించదలచిన వారు 899 7541 3174 ఐడీ ద్వారా 026266 పాస్ వర్డ్‌తో చూడగలరు. మరిన్ని వివరాలకు 8978801247 నంబర్‌కు వాట్సాప్ చేయగలరు. 

Updated Date - 2021-06-17T22:56:35+05:30 IST