ధర్మాన అనుచరులు.. తగ్గేదేలే..?!

ABN , First Publish Date - 2022-04-10T16:37:26+05:30 IST

జగన్ కేబినెట్‌లోకి కొత్తగా తీసుకుంటున్న మంత్రుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియక ముందే కొంతమంది వైసీపీ ..

ధర్మాన అనుచరులు.. తగ్గేదేలే..?!

శ్రీకాకుళం: జగన్ కేబినెట్‌లోకి కొత్తగా తీసుకుంటున్న మంత్రుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో తెలియక ముందే కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం తెగ హడవుడి చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ అధిష్ఠానం కొత్త మంత్రుల జాబితా ప్రకటించకముందే ధర్మాన ప్రసాదరావు అనుచరుల వ్యవహార శైలి మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న.. ధర్మాన ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ అనుచరులు ఫెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా  హైకమాండ్ నుంచి మంత్రి పదవులపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ విషయంలో క్యాడర్ హడవుడి మాత్రం తగ్గడం లేదు.

Updated Date - 2022-04-10T16:37:26+05:30 IST