మంత్రి గారి చెంప దెబ్బ

ABN , First Publish Date - 2022-04-17T08:12:40+05:30 IST

రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీకాకుళం వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి

మంత్రి గారి చెంప దెబ్బ

కార్యకర్తపై ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం

కరచాలనానికి చేయి అందిస్తే.. చేయి చేసుకున్నారు

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌


శ్రీకాకుళం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీకాకుళం వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తమ నాయకుడిపై అభిమానంతో ఓ కార్యకర్త చేయి అందించేందుకు ముందుకురాగా.. మంత్రి కోపంతో ఆయన చెంప చెళ్లుమనిపించారు. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారు విస్తుపోయారు. శుక్రవారం రాత్రి ధర్మాన స్వాగత ర్యాలీలో ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్తున్న మంత్రితో కరచాలనానికి నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ఓ కార్యకర్త అలా ముందుకురాగా.. మంత్రి అతడి చెంపపై కొట్టారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానంతో శుభాకాంక్షలు చెప్పడానికి ముందుకొస్తే మంత్రి ఇలా చేయడం తగునా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-04-17T08:12:40+05:30 IST