విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగదు

ABN , First Publish Date - 2021-02-28T05:27:43+05:30 IST

పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణకు పూనుకోవడం సమంజసం కాదని సీపీఐ మండల కార్యదర్శి టీవీఎస్‌ రాజు అన్నారు.

విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ తగదు
జంగారెడ్డిగూడెం డిగ్రీ కళాశాల వద్ద నిరసన తెలియజేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌

కామవరపుకోట, ఫిబ్రవరి 27 :  పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణకు పూనుకోవడం సమంజసం కాదని సీపీఐ మండల కార్యదర్శి టీవీఎస్‌ రాజు అన్నారు. శనివారం ఆయన స్థానిక  పార్టీ  కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించు కోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  ఏఐటీయూసీ అధ్యక్షుడు కంకిపాటి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. 

జంగారెడ్డిగూడెం: విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం చేసిన పార్టీలకు, ఈ వ్యవ హారంలో బాధ్యతా రాహిత్యం తో ఉన్న అధికార పార్టీకి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్ప డానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా రని ఏఐఎస్‌ ఎఫ్‌  జిల్లా కార్య దర్శి టి.అప్పలస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి శివ, జిల్లా కమిటీ సభ్యులు చింతలపూడి సునీల్‌ అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం డిగ్రీ కాళాశాల వద్ద ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన  తెలిపారు.  జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన రూపంలో రావలసిన సొమ్ము తక్షణమే విడుదల చేయాలన్నారు. 


Updated Date - 2021-02-28T05:27:43+05:30 IST