Agitation: హామీలు అమలు చేయాలంటూ ధర్నా

ABN , First Publish Date - 2022-08-26T19:49:01+05:30 IST

Vijayawada: ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అమలు చేయాలంటూ బ్రాహ్మణ సంఘాలు విజయవాడలో ధర్నా చేశాయి. టీడీపీ నేతలు బొండా ఉమ (Bonda Uma), ఆనంద్ సూర్య వారికి

Agitation: హామీలు అమలు చేయాలంటూ ధర్నా

Vijayawada: ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అమలు చేయాలంటూ బ్రాహ్మణ సంఘాలు విజయవాడలో ధర్నా చేశాయి. టీడీపీ నేతలు బొండా ఉమ (Bonda Uma), ఆనంద్ సూర్య వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ‘‘ఓట్ల కోసం జగన్ లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. మూడున్నరేళ్లలో వాటిని అమలు చేయకుండా మోసం చేశారు. చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇస్తే.. జగన్ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. తక్షణమే జగన్ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు బడ్జెట్ విడుదల చేయాలి’’ అని పేర్కొన్నారు. 

 

పేద ఎస్సీ, ఎస్టీలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ ధర్నా

పేద ఎస్సీ, ఎస్టీలందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘‘దళితుల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్.. ఆ దళితులనే దగా చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పేదలకు ఉచిత కరెంట్ పథకాన్ని పునరుద్ధరించాలి. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా ఎస్సీ, ఎస్టీలకు 200 నుంచి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలి. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కాలనీలలో నివసించే వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ’’

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు


  

Updated Date - 2022-08-26T19:49:01+05:30 IST