కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
Published: Fri, 21 Jan 2022 23:47:01 IST

కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులు
v>తమను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు అందించాలని డిమాండ్
విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేసి డీఏ, హెచ్ఆర్ఏలతో కూడిన కనీస వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లు తెలియజేస్తూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు తమ కోరికలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఎ.వెంకటరావు మాట్లాడుతూ పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు తమను నిరాశకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలకు భిన్నంగా జీవోలు ఉన్నాయన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 31న చలో విజయవాడ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే, ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు వెల్లడించారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.