అధిక ధరలు తగ్గించాలని ధర్నా

ABN , First Publish Date - 2021-06-20T05:20:23+05:30 IST

కేంద్ర ప్రభుత్వం చమురు, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు.

అధిక ధరలు తగ్గించాలని ధర్నా
నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు

 పాలమూరు/భూత్పూర్‌/హన్వాడ, జూన్‌ 19: కేంద్ర ప్రభుత్వం చమురు, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యద ర్శులు ఎ.రాములు(సీపీయం), బి.పరమేశ్వర్‌గౌడ్‌(సీపీఐ), సీ.హెచ్‌ రాంచందర్‌(న్యూడెమోక్రసీ) మాట్లాడారు. ధర్నాలో నాయకులు కిల్లె గోపాల్‌, సి.వెంకటేష్‌, ఎన్‌.కురుమూర్తి, పి.సురేష్‌, అల్వాల్‌రెడ్డి, పాషా, సాంబశివుడు, దేవదానం, పద్మ పాల్గొన్నారు. 

 భూత్పూర్‌: పెంచిన డీజీల్‌, పెట్రోల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని టీపీఎస్‌కే జిల్లా కన్వీనర్‌ కురుమూర్తి డిమాండ్‌ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులతో ప్లకార్డులతో శనివారం నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో మున్నికి వినతి పత్రం అందించారు. 

 హన్వాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్రం పెట్రోధరలను తగ్గించాలని సీపీఎం నాయకులు శనివారం హన్వాడలో నిరసన తెలిపారు.

Updated Date - 2021-06-20T05:20:23+05:30 IST