Advertisement

ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా

Jan 24 2021 @ 00:32AM
కలెక్టరేట్‌ ఎదుట దర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 23:  పీఆర్సీ ప్రక టించాలని  కలెక్ట రేట్‌ ఎదుట శనివారం ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్వంలో ఉపాధ్యా యులు ధర్నా చేప ట్టారు. మధ్యాహ్నం భోజన విరామసమ యంలో  కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. రాజేశ్వర్‌రావు, భూపాల్‌రెడ్డి, పాకాల శంకర్‌, మల్లేశం, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌:  సిరిసిల్లలో ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  గెజిటెడ్‌ ఉపాధ్యాయుల సం ఘం బాధ్యులు పరబ్రహ్మమూర్తి, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  శంకర్‌గౌడ్‌, బీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి  మల్లేశం, టీపీటీఎఫ్‌ జిల్లా ఉపా ధ్యక్షుడు పురుషోత్తం, జిల్లా ప్రచార కార్యదర్శి కృష్ణచైతన్య పాల్గొన్నారు. 

వేములవాడ టౌన్‌: వేములవాడ రూరల్‌ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులు నల్లబాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌  తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డిపేట కోనరావుపేట, ముస్తాబాద్‌, చందుర్తి,  మండల కేంద్రాల్లో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Follow Us on:
Advertisement