Dhavaleshwaram barrage వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2022-07-13T13:22:23+05:30 IST

భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Dhavaleshwaram barrage వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

రాజమండ్రి: భారీ వర్షాల నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్(Dhavaleshwaram Cotton Barrage) వద్ద  రెండో  ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటల నుంచి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద నీటి ప్రవాహంతో విలీన మండలాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వరద నీరు రహదారులపై పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పునరావాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక వరద బాధితులుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కాజ్‌వేలపై వరద నీరు  పొంగి ప్రవహిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాటుపడవలపైనే ప్రజలు  ప్రయాణం సాగిస్తున్నారు. 

Updated Date - 2022-07-13T13:22:23+05:30 IST