Godavari flood: ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ABN , First Publish Date - 2022-08-11T12:54:19+05:30 IST

గోదావరి (Godavari)కి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం (Dhavaleswaram) దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Godavari flood: ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

రాజమండ్రి: గోదావరి (Godavari)కి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం (Dhavaleswaram) దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.19 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా (Eluru District) కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారులు కూడా నీట మునిగాయి. వేలేరుపాడు మండలంలో దాదాపు 40 గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. గోదావరి నదికి ఎగువన వరద తక్కువగానే ఉన్నప్పటికీ శబరి, పోలవరం బ్యాక్‌ వాటర్‌ కారణంగా గతం కంటే 8 అడుగుల వరద నీరు అధికంగా వచ్చి చేరింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ ఎగువన గోదావరి నీటిమట్టం 33.370 మీటర్లు, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 24.760 మీటర్లు నమోదయింది.


Updated Date - 2022-08-11T12:54:19+05:30 IST