Ms Dhoni ఇచ్చిన సలహా బయటపెట్టిన CSK ఓపెనర్ Convey

ABN , First Publish Date - 2022-05-09T23:51:18+05:30 IST

ముంబై : IPLలో గత 15 ఏళ్లుగా Chennai Super Kings (సీఎస్కే) విదేశీ ఆటగాడితో ఇన్నింగ్స్‌ను ఆరంభించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

Ms Dhoni ఇచ్చిన సలహా బయటపెట్టిన CSK ఓపెనర్ Convey

ముంబై : IPLలో గత 15 సీజన్లుగా Chennai Super Kings (సీఎస్కే) ఓ విదేశీ ఆటగాడితో ఇన్నింగ్స్‌ను ఆరంభించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. తొలుత మైక్ హస్సీ, ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్, ఇప్పుడు డెవొన్ కాన్వే చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభింస్తున్నారు. ఈ సీజన్‌లో కాన్వే ఎంట్రీ కాస్త ఆలస్యమే అయినా ఈ న్యూజిలాండ్ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి చక్కటి ఆరంభాలను అందిస్తున్నాడు. గత రెండు సీజన్లలో ఫాఫ్ డుప్లెసిస్‌ ప్రదర్శనతో పోల్చితే చక్కటి ప్రారంభాలను అందించడంలో అతడు సఫలీకృతమవుతున్నాడు. స్పిన్నర్లను సరిగా ఎదుర్కోలేడని పేరుబడ్డ కాన్వే గత రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. చక్కటి షాట్లతో భారీగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరి బౌలింగ్‌లో కేవలం 20 బంతుల్లోనే 54 పరుగులు కొట్టాడు.


ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌లో స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు కాన్వే బ్యాటింగ్ టెక్నిక్‌లో వ్యత్యాసం కనిపించింది. స్విపింగ్‌కు బదులు షాట్లు కొట్టి విజయవంతమయ్యాడు. అయితే విజయవంతమైన ఈ మార్పునకు కారణం ఏంటో మ్యాచ్ అనంతరం కాన్వే బయటపెట్టాడు. ‘‘ ఈ క్రెడిట్‌ కెప్టెన్ మహింద్ర సింగ్ ధోనికే దక్కుతుంది. గత మ్యాచుల్లో ఎక్కువగా స్వీప్ చేసేవాడిని. దురదృష్టవశాత్తూ ఔటయ్యేవాడిని. కానీ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌పై మ్యాచ్‌కు ముందు కెప్టెన్ మహింద్ర సింగ్ ధోనీ  విలువైన సలహా ఇచ్చాడు. ఈ రోజు నీకు ఫుల్లర్ డెలివరీలు చేసే అవకాశం ఉంది. బయటకు జరిగి స్ట్రైయిట్‌గా కొట్టమని ధోనీ నాకు సూచించాడు. ఈ సూచనను ఖచ్చితంగా అమలు చేశాను. అందుకే విజయవంతమయ్యాను’’ అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్వీకరించిన సమయంలో కాన్వే వెల్లడించాడు.


కాగా గత మ్యాచ్‌లో కాన్వే కేవలం 49 బంతుల్లోనే 87 రన్స్ బాదాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండడం విశేషం. కాన్వే భారీ సహాయంతో చెన్నై 200లకుపైగా స్కోరును నమోదు చేయగలిగింది. కాగా ఏదైనా అద్భుతం జరిగి చెన్నై ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అసవరం లేదు.

Read more