ధోనీ తమిళ ప్రజలలో ఒకడిగా మారిపోయాడు: స్టాలిన్

Published: Sat, 20 Nov 2021 19:58:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ధోనీ తమిళ ప్రజలలో ఒకడిగా మారిపోయాడు: స్టాలిన్

చెన్నై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. ధోనీ ఝార్ఖండ్‌ వాడైనా తమిళ ప్రజలలో ఒకడిగా మారిపోయాడని అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, సీఎఎస్‌కే అభిమాని శ్రీనివాసన్ కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందించారు.


అలాగే, ఆటగాళ్ల  సంతకాలతో కూడిన జెర్సీని కూడా సీఎంకు అందించారు. ఆయనకు అందించిన నంబర్ 7 జెర్సీపై ‘ఎంకే స్టాలిన్ అని రాసి ఉండడం గమనార్హం.  ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


ధోనీ మాట్లాడుతూ.. ఐపీఎల్‌తో తన చివరి మ్యాచ్‌ను చెపాక్ మైదానంలో ఆడతానన్నాడు. చెన్నై ప్రజలు ఎంతో మంచివారని, గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ముంబై ఇండియన్స్ తరపున తన చివరి మ్యాచ్‌ను అదే మైదానంలో ఆడిన విషయాన్ని ధోనీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.


తన చివరి మ్యాచ్‌ను చెపాక్‌లో ఆడతానని చెప్పడం ద్వారా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటానని ధోనీ చెప్పకనే చెప్పాడు. ఈ సందర్భంగా ఐపీఎల్ ట్రోఫీని వేదికపై ప్రదర్శించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.