రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయి: Dhulipalla

ABN , First Publish Date - 2022-07-06T19:25:20+05:30 IST

వైసీపీ(YCP) ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhupalla Narendra) పేర్కొన్నారు.

రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయి: Dhulipalla

Guntur : వైసీపీ(YCP) ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhupalla Narendra) పేర్కొన్నారు. రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకొని ఎకారానికి రూ.10 వేలు నష్టపోయారన్నారు. రైతు భరోసా కేంద్రాలు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. కోపరేటివ్ సొసైటీ బ్యాంకు(Co Operative Society Bank)లో రైతులు డబ్బులు దోచుకున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. కో ఆపరేటివ్ బ్యాంకులో అవినీతిపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని.. ప్రభుత్వం మెడలు వంచుతామని పేర్కొన్నారు. డైరీ రంగంపై కేంద్ర జీఎస్టీ 5శాతం వేయడం వల్ల పాడి పరిశ్రమ బతికే అవకాశం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల డైరీ రంగం కుదేలవుతుందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-06T19:25:20+05:30 IST