ధూళిపాళ్లను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

ABN , First Publish Date - 2021-04-23T17:00:19+05:30 IST

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు.

ధూళిపాళ్లను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ సమయంలో దూళిపాళ్ల నరేంద్రను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులను....లోనికి అనుమతించేందుకు ఏసీబీ అధికారులు నిరాకరించారు. నరేంద్రను విచారిస్తున్నామని.. విచారణ పూర్తి అయిన తరువాతే కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. మరోవైపు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణని, కార్యదర్శి గుర్నాధాన్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున వంద మందికి పైగా పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి చేరుకోగా... ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.


కాగా.. సంగం డెయిరీలో అవకతవకలు జగిగాయంటూ నరేంద్రపై ఏసీబీ కేసు నమోదు చేసింది. 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఆర్‌పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్టు నోటీసులో ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో చైర్మన్‌గా ఉన్నారు. సంగంకు సంబంధించిన కేసులోనే ధూళిపాళ్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

Updated Date - 2021-04-23T17:00:19+05:30 IST