TDP: జగన్‌ పర్యటనంటే భయపడుతున్న జనం: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2022-09-23T21:46:30+05:30 IST

గతంలో దొంగలు, బందిపోట్లను చూసి భయపడే జనం నేడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి(CM JAGAN REDDY) పర్యటనంటే భయపడుతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) అన్నారు.

TDP: జగన్‌ పర్యటనంటే భయపడుతున్న జనం: ధూళిపాళ్ల

అమరావతి: గతంలో దొంగలు, బందిపోట్లను చూసి భయపడే జనం నేడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి(CM JAGAN REDDY) పర్యటనంటే భయపడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేడు జగన్‌రెడ్డి పర్యటనకు వచ్చే ప్రాంతాల్లో వ్యాపారాలు ఆఖరికి మెడికల్ షాపులను సైతం మూసివేయడం దుర్మార్గమన్నారు.ముఖ్యమంత్రి పర్యటనకు రాకపోతే పథకాలు నిలిపివేస్తాం, పెనాల్టీలు విధిస్తామని వైసీపీ నేతలు(YCP leaders) దౌర్జాన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైజాగ్(Vizag) పర్యటనలో స్కూళ్లకు సెలవివ్వండని అధికారులే ప్రకటన ఇవ్వడం అధికారదుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి సభ మధ్యలో ప్రజలు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేస్తున్నారన్నారు. పరదాలు కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి ఎవరని పోల్ పెడితే వచ్చే పేరు జగన్ రెడ్డిదేనని సెటైర్లు వేశారు.


బీసీల మీద అంత ప్రేమ ఉన్న జగన్ చిత్తూరు జిల్లాలో బీసీలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. జగన్ దగ్గర అక్రమ సంపాదన ఉంది కాబట్టే బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయని చెప్పారు. చిత్తూరు జిల్లాలో సహాకార రంగంలో అతి పెద్దదైన శ్రీజా డెయిరీ జగన్‌కి ఎందుకు కనపడదు? అని నిలదీశారు. 54 పాల సెంటర్లను బలవంతంగా మూయించి 60వేల లీటర్ల పాలను నిలిపివేశారని మండిపడ్డారు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఇలాకాలో అమూల్ డెయిరీ(Amul Dairy) పాల సేకరణ చేసే సత్తా జగన్‌రెడ్డికి లేదా? అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

Updated Date - 2022-09-23T21:46:30+05:30 IST