దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-03T06:08:54+05:30 IST

గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత, తాటి చెట్లను ధ్వంసం చేసిన దుండగులపై అధికారులు కఠిన చర్య లు తీసుకోవాలని బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మండ లంలోని కిష్టాపురం గ్రామంలోని ప్ర భుత్వం భూమిలోని ఈత చెట్లను ఓ భూకబ్జాదారుడు ధ్వంసం చేసిన ప్రాం తాన్ని ఆయన బుఽధవారం పరిశీలించి మాట్లాడారు.

దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి
నల్లగొండ జిల్లా కిష్టాపురంలో ఈతచెట్టును పరిశీలిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌

 బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్‌ 

మునుగోడు రూరల్‌, డిసెంబరు 2:     గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత, తాటి చెట్లను ధ్వంసం చేసిన దుండగులపై అధికారులు కఠిన చర్య లు తీసుకోవాలని బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.  మండ లంలోని కిష్టాపురం గ్రామంలోని ప్ర భుత్వం భూమిలోని ఈత చెట్లను ఓ భూకబ్జాదారుడు ధ్వంసం చేసిన ప్రాం తాన్ని ఆయన బుఽధవారం పరిశీలించి మాట్లాడారు.  100 మంది గీతకార్మికులు అధారపడి జీవి స్తున్న చెట్లను ధ్వంసం చేయడం అమానుష మన్నారు.  ఉపాధి లేకుండా చేసిన నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని జాజుల డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జాజుల అంజాగౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి,  రేవెల్లి మలే ్లష్‌,  గీత కార్మిక సంఘం నాయకులు జాజుల  నర్సిం హ,  మునుకుంట్ల నర్సింహ,  మల్లయ్య,  సర్పంచ్‌ నందిపాటి రాధా, ఎంపీటీసీ బీమనపల్లి సైదులు, గీత కార్మికులు ఉన్నారు. 

  ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు 

 మునుగోడు రూరల్‌: ప్రభుత్వ ఆస్తులను ధ్వం సం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని  చం డూరు ఎక్సైజ్‌ సీఐ చంద్రబానునాయక్‌ మును గోడు ఎస్‌ఐ రజనీకర్‌  హెచ్చరించారు. మండలం లోని కిష్టాపురం గ్రామంలో కొందరు తాటి, ఈత చెట్లను ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతాన్ని వారు పరిశీలించి మాట్లాడారు.  చెట్లను ధ్వంసం చేయ డానికి సహకరించిన జేసీబీ యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. మాజీ జడ్పీటీసీ అంజయ్య గౌడ్‌ సర్పంచ్‌ నందిపాటి రాధా రమేష్‌ ఎంపీటీసీ సైదులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T06:08:54+05:30 IST