కిడ్నీ రోగులకు అందుబాటులో డయాలసిస్‌ కేంద్రం

ABN , First Publish Date - 2022-07-06T06:31:15+05:30 IST

కిడ్నీ రోగులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో రూ.3 కోట్లతో డయాలసిస్‌ సెంటర్‌ నిర్మించినట్టు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు.

కిడ్నీ రోగులకు అందుబాటులో డయాలసిస్‌ కేంద్రం
ఎరుకపాడులో గడపగడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే రక్షణనిధి

ఎమ్మెల్యే రక్షణనిధి

తిరువూరు :  కిడ్నీ రోగులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో రూ.3 కోట్లతో డయాలసిస్‌ సెంటర్‌  నిర్మించినట్టు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు. నూతనంగా నిర్మించిన  భవనాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2019లో  జగన్‌ వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు  కేంద్రం నిర్మించామన్నారు. త్వరలో ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కిడ్నీ రోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. కార్యక్రమంలో వైద్యశాల చైర్మన్‌ రేగళ్ల మోహన్‌రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు(బీరువాలబాబు), ఏరువ ప్రకాష్‌రెడ్డి, పరసా శ్రీనివాసరావు పాల్గొన్నారు.


 పథకాలు పేదల ఇంటి ముందుకు తెచ్చిన ప్రభుత్వం 

 సంక్షేమ పథకాలను అర్హుల ఇళ్ల ముందుకు తెచ్చిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డిదని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అన్నారు.  ఎరుకపాడు పంచాయతీలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన  అభివృద్ది సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన కరపత్రాలు అందించారు. గ్రామంలో రహదారి, డ్రె యిన్‌, తాగునీటి సమస్యలను గ్రామస్థులు వివరించారు. సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Updated Date - 2022-07-06T06:31:15+05:30 IST