ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-09T05:02:22+05:30 IST

వర్గల్‌ మండల కేంద్రంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
వర్గల్‌ కేంద్రంలో 150 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

వర్గల్‌లో150 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు

వర్గల్‌, ఆగస్టు 8: వర్గల్‌ మండల కేంద్రంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో తయారుచేసిన 150 మీటర్ల జాతీయ జెండా పతాకంతో విద్యార్థులు నినాదాలు చేస్తూ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ సతీ్‌షకుమార్‌ మాట్లాడుతూ వర్గల్‌ గ్రామంలో 150 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తూంకుంట గోపాల్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశంగౌడ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వర్గల్‌ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ గోవిందరావు, ఏటీపీ వరలక్ష్మి, డీడబ్ల్యూ జానకి, ఎన్‌ఎ్‌సఎస్‌ నిర్వాహకులు ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ములుగు: సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ప్రారంభించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు జిల్లా ప్రతినిధులు బయలుదేరారు. కాగా ములుగులోని రైతువేదిక వద్ద జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, మర్కుక్‌ ఎంపీపీ పాండుగౌడ్‌, గజ్వేల్‌ జడ్పీటీసీ మల్లేశం, రామచంద్రం, జయమ్మ తదితరులు బయలుదేరిన వారిలో ఉన్నారు. అలాగే ములుగు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి నాలుగు వేల జాతీయ జెండాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు నర్సింహులు, శ్రీనివా్‌సగౌడ్‌, శోభ పాల్గొన్నారు. 

చేర్యాల: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని చేపట్టనున్న ద్విసప్తాహ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పాటుపడాలని మునిసిపల్‌ కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ అన్నారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. 9 నుంచి 21వ  తేదీవరకు రోజువారీగా చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ జనరల్‌ మేనేజర్‌ జీ.ప్రభాకర్‌ ఏఈ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం హుస్నాబాద్‌ డివిజన్‌ పరిధిలోని మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 

కొండపాక: విద్యార్థులు చిన్నప్పటినుంచి దేశభక్తిని అలవర్చుకోవాలని ఎంపీడీవో రాంరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పుల్కంపల్లి జయంతినరేందర్‌, ఎంపీటీసీ భూమాగౌడ్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

దౌల్తాబాద్‌: మండల కేంద్రమైన దౌల్తాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సంపత్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ఆవాలతో మువ్వన్నెల జాతీయ జెండా

గజ్వేల్‌ రూరల్‌, ఆగస్టు 8: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సోమవారం గజ్వేల్‌ రామకోటి రామరాజు తన కార్యాలయంలో ఆవాలతో 10 అడుగుల మువ్వన్నెల జెండాను వినూత్నంగా వేసి దేశభక్తిని చాటుకున్నాడు. చిత్రాన్ని చూసి పలువురు రామరాజును అభినందించారు.

Updated Date - 2022-08-09T05:02:22+05:30 IST