భారీ జాతీయ జెండాలతో వజ్రోత్సవ ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం పటాన్‌చెరులో నిర్వహించిన భారీ ర్యాలీలో దేశభక్తి ఉప్పొంగింది.

భారీ జాతీయ జెండాలతో వజ్రోత్సవ ర్యాలీ
పటాన్‌చెరులో 250 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

చిట్కూల్‌, జహీరాబాద్‌లో 750 మీటర్లు, పటాన్‌చెరులో 250 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ 

పటాన్‌చెరు/జోగిపేట/పటాన్‌చెరు రూరల్‌/జహీరాబాద్‌/నారాయణఖేడ్‌/జిన్నారం/మునిపల్లి/సంగారెడ్డి అర్బన్‌/గుమ్మడిదల/కంది/నాగల్‌గిద్ద/సంగారెడ్డి రూరల్‌/రాయికోడ్‌/ఝరాసంగం, ఆగస్టు 13: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం పటాన్‌చెరులో నిర్వహించిన భారీ ర్యాలీలో దేశభక్తి ఉప్పొంగింది. ఎమ్మెల్యే  మహిపాల్‌రెడ్డి నేతృత్వంలో ఆయా విద్యాసంస్థల విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, స్కౌట్స్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ వలంటీర్లు, ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రాపురం నుంచి జాతీయ రహదారి మీదుగా పటాన్‌చెరు మైత్రీ మైదానం వరకు 250 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. జోగిపేటలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆధ్వర్యంలో జంటపట్టణాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన వందలాది మంది విద్యార్థులు అంబేడ్కర్‌ కూడలి నుంచి క్లాక్‌ టవర్‌ వరకు 20 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. చిట్కుల్‌ సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో 750 మీటర్లు జాతీయ పతాకంతో చిట్కుల్‌ నుంచి ఇస్నాపూర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్‌లో మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో ఆర్డీవో రమేశ్‌బాబు, డీఎస్పీ రఘు, మున్సిపల్‌ కమిషనర్‌ సుభా్‌షరావు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతునిధులు 750 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో పట్టణంలోని ప్రధాన రహదారి గుండా బాగారెడ్డి స్టేడియం నుంచి ఎంఆర్‌హెచ్‌ఎస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జిన్నారంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, సర్పంచ్‌ లావణ్య ఆధ్వర్యంలో 225 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, విద్యార్థులు తహసీల్‌ మైదానం నుంచి శివాజీ చౌక్‌ వరకు 75 అడుగుల జెండాతో ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి తహసీల్‌ మైదానం వరకు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీలో మహిళలు నిర్వహించిన బతుకమ్మ ప్రదర్శన, విద్యార్థుల కవాతులు ఆకట్టుకున్నాయి. మునిపల్లిలో ఎంపీపీ శైలజ, జడ్పీటీసీ మీనాక్షి ఆధ్వర్యంలో మునిపల్లి- ఖమ్మంపల్లి చౌరస్తా నుంచి బుధేరా జాతీయ రహదారి వరకు సుమారు 7.5 కి.మీల ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జాతీయ కార్యదర్శి శ్యామ్‌రాజ్‌, జాతీయ కార్యవర్గ సభ్యురాలు బులబుల్‌ మిస్ట్రీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర బైక్‌ ర్యాలీ నిర్వహించారు.  రాయికోడ్‌లో జడ్పీటీసీ మల్లికార్జున్‌పాటిల్‌, ఎంపీపీ మమత అశోక్‌, తహసీల్దార్‌ కార్యాలయం నుంచి చిన్నపురి వరకు 4 కి.మీ మేర ర్యాలీ నిర్వహించారు. కందిలో విద్యార్థులు, నాగల్‌గిద్దలో ఎంపీపీ మోతిబాయిరాథోడ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌,  సంగారెడ్డిలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆశన్నగౌడ్‌, రమే్‌షగౌడ్‌, గుమ్మడిదలలో ఎంపీపీ ప్రవీణావిజయభాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, ఝరాసంగంలో ఎంపీడీవో సుజాత, ఎస్‌ఐ రాజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు.




మెదక్‌ జిల్లాలో 

మెదక్‌ అర్బన్‌/చిన్నశంకరంపేట/నర్సాపూర్‌/హవేళిఘణపూర్‌/పెద్దశంకరంపేట/మెదక్‌ మున్సిపాలిటీ/రామాయంపేట/చిల్‌పచెడ్‌/కొల్చారం/తూప్రాన్‌/తూప్రాన్‌ (మనోహరాబాద్‌)/మాసాయిపేట/తూప్రాన్‌రూరల్‌, ఆగస్టు13: మెదక్‌లో సిద్దార్థ్‌ విద్యా సంస్థలు, ఎన్‌సీసీ, వివిధ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, డీఈవో రమే్‌షకుమార్‌, డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. చిన్నశంకరంపేటలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ రాజీరెడ్డి ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ పథాకంతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్‌ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు  ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎస్పీ యాదగిరిరిరెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, బెలున్లను ఎగురవేశారు.  నర్సాపూర్‌లో మున్సిపల్‌ఛైర్మన్‌ నయిమోద్దిన్‌ ఆధ్వర్యంలో మైనార్టీలు, బీవీఆర్‌ఐటీ కాలేజీలో శనివారం విద్యార్థులు, సిబ్బంది, హవేళిఘణపూర్‌లో గురుకుల పాఠశాల విద్యార్థులు, పెద్దశంకరంపేటలో ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, జడ్పీటీసీ, సర్పంచు విజయరామరాజు, అలుగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో, మెదక్‌లో  మున్సిపల్‌ ఛైర్మన్‌ చంద్రపాల్‌ ఆధ్వర్యంలో, రామాయంపేటలో మున్సిపల్‌ చైర్మన్‌ జితేందర్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ విజయలక్ష్మి, ఎస్‌ఐ రాజేశ్‌, చిల్‌పచెడ్‌లో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, ఎస్‌ఐ మహ్మద్‌ గౌస్‌, కొల్చారం మండలం యనగండ్లలో ఎంపీపీ మంజుల, తూప్రాన్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో,  మనోహరాబాద్‌లో జడ్పీచైర్‌పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌, మాసాయిపేట మండలం కొప్పులపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, తూప్రాన్‌ మండలంలో డీఎల్‌పీవో శ్రీనివా్‌స,ఎంపీడీవో అరుంధతి ఆధ్వర్యంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు.

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST