డైమండ్‌ రాజా వస్తున్నాడు

Published: Mon, 08 Aug 2022 00:35:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
డైమండ్‌ రాజా వస్తున్నాడు

వరుణ్‌ సందేశ్‌, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. శ్రీనివాస్‌ గుండ్రెడ్డి దర్శకుడు. బి.క్రాంతి ప్రభాత్‌ రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘ఆకాశమే నువ్వని’ అనే గీతాన్ని యువ కథానాయకుడు నిఖిల్‌ విడుదల చేశారు. అచ్చు స్వరపరిచిన గీతమిది. రాంబాబు గోశాల సాహిత్యం అందించారు. సిద్‌ శ్రీరామ్‌, చిన్మయి ఆలపించారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘వారం రోజుల క్రితం వరుణ్‌ ఓ పార్టీలో కలిసినప్పుడు ఈ పాట వినిపించాడు. చాలా అద్భుతంగా ఉంది. హిట్లూ, ఫ్లాపులూ సహజమే. ఎవరికైనా ఒక్క హిట్టు పడితే మళ్లీ ప్రయాణం జోరందుకుంటుంది. ఈ సినిమాతో వరుణ్‌ ఫామ్‌లోకి వస్తాడ’’న్నారు. ‘‘హ్యాపీడేస్‌, కొత్త బంగారులోకం చిత్రాల్లో పాటలకు మంచి పేరొచ్చింది. ఆ తరవాత.. అంతగా ఈ ఆల్బమ్‌ ఆకట్టుకుంటుందని నా నమ్మకం. సిద్‌ శ్రీరామ్‌ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఈ పాట పాడడం ఆనందంగా ఉంది. కుటుంబం అంతా కలిసి చూసి, హాయిగా నవ్వుకొనే సినిమా ఇద’’న్నారు వరుణ్‌ సందేశ్‌. చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International