రాష్ట్రంలో నియంతపాలన

ABN , First Publish Date - 2021-03-09T06:05:57+05:30 IST

రాష్ట్రంలో నియంతపాలన

రాష్ట్రంలో నియంతపాలన
పరిగిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకసభలో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

  • ఎమ్మెల్సీ ఎన్నికలతో కేసీఆర్‌కు కనువిప్పు కలిగించాలి
  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  పొన్నం ప్రభాకర్‌ 


పరిగి: రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వికారాబాద్‌ జిల్లా పరిగిలో నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారన్నారు. కేసీఆర్‌ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్న పదాలు కనిపించకుండా పోయాయని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు ప్రాణహిత, పాలమూరు పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  చేవెళ్ల మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీజం వేసింది కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి అని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసం కేసీఆర్‌ పరోక్షంగా 40మందికిపైగా స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపారని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కల సాకారం కావడానికి కారణమైన చిన్నారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించేందుకు పట్టభద్రులందరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే నిరుద్యోగభృతి, ఉద్యోగాల కోసం పోరాడుతానని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పార్థసారథి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ భీంరెడ్డి, మునిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, డీసీసీ కార్యదర్శులు కె.హన్మంత్‌ముదిరాజ్‌, ఎం.లాల్‌కృష్ణ, ప్రసాద్‌, కృష్ణ, బి.పరశురాంరెడ్డి, సురేందర్‌, విజయ్‌కుమార్‌, ఆంజనేయులు, నారాయణ పాల్గొన్నారు. కాగా, బీజేపీ అభ్యర్థి చిన్నారెడ్డి  పరిగిలో న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజల పక్షాన పోరుడుతానన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరుద్యోగుల అసంతృప్తి: చిన్నారెడ్డి 

వికారాబాద్‌: అభ్యర్థిని పక్కన పెట్టి బీజేపీ, పార్టీని పక్కన పెట్టి వాణీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం నిర్వహిస్తున్నారని  కాంగ్రెస్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డిఅన్నారు. సోమవారం రాత్రి మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ కూతురు తాను నిర్వహిస్తున్న ఎన్నికలలో భాగంగా ఫోన్‌ మెసేజ్‌లో నా పేరు పక్కన ఒకటో నెంబర్‌ వేసి గెలిపించాలని కోరుతుంది తప్ప ఎక్కడా టీఆర్‌ఎస్‌ పేరు గానీ, కేసీఆర్‌ పేరు గానీ ప్రస్తావన తీసుకురావడం లేదన్నారు.  పీవీకుటుంబంపై ప్రేమ ఉంటే వాణీదేవికి రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించేవారని విమర్శించారు. కేసీఆర్‌ నిలబడ్డా గెలవలేని స్థానంలో నిలబెట్టి పీవీ కుటుంబానికి అపకీర్తి తెస్తున్నారన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్న నాగేశ్వరరావు రెండు పర్యాయాలుగా ఎమ్మెల్సీగా పనిచేసి కేవలం టీవీ డిబేట్‌లకే పరిమితమయ్యారన్నారు. బీజేపీ నుండి పోటీ చేసిన రాంచందర్‌రావు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఏ రోజు చట్టసభల్లో గొంతెత్తలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, కిషన్‌నాయక్‌, రఘువీరారెడ్డి పాల్గొన్నారు. 


కాంగ్రె్‌సపై ఆరోపణలు చేస్తే నాలుక కోస్తాం

తాండూరు: కాంగ్రె్‌సపై అనవసరంగా ఆరోపణలు చేస్తే టీఆర్‌ఎస్‌ నాయకుల నాలుక కోస్తామని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాండూరు పట్టణంలో సోమవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే తత్వమున్న చిన్నారెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.రమేష్‌, జడ్పీటీసీ ధారాసింగ్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌, కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు ఉత్తంచంద్‌, జనార్ధన్‌రెడ్డి, సతీ్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


కాంగ్రెస్‌ నాయకుల ప్రచారం 

బొంరా్‌సపేట్‌: మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జయక్రిష్ణ, వెంకట్రాములుగౌడ్‌, హజీమలాంగ్‌బాబా, సలీం, మల్లికార్జున్‌ తదితరులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి పట్టభద్రులు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  


‘టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను కాపీ చేస్తున్న బీజేపీ’

వికారాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతోందని, దేశంలో ఏరాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్‌ భవనంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. వికారాబాద్‌లో 100ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ మంజూరైనట్లు తెలిపారు. టీఎ్‌సపీఎ్‌ససీ మాజీ సభ్యులు సి.విఠల్‌ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనంద్‌, కొండల్‌రెడ్డి, చింత ప్రభాకర్‌, జాంగీర్‌ పాష, శుభప్రద్‌పటేల్‌  పాల్గొన్నారు.


వాణీదేవిని గెలిపించండి: టీఆర్‌ఎస్‌ శ్రేణులు

మోమిన్‌పేట/కొడంగల్‌/ధారూరు/కులకచర్ల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మేకవనంపల్లిలోని హరితవనంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి ప్రభాకర్‌, జహంగీర్‌పాషాలతో కలిసి పట్టభద్రుల ఆత్మీయుల సమ్మేళనసభ నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారం, టేకల్‌కోడ్‌, చిట్లపల్లి, అంగడి రాయచూరు గ్రామాల్లో ఎమ్మెల్యే, పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి రాజేశ్వర్‌ ప్రచారం నిర్వహించారు. ధారూరులోని గురుదోట్ల, పులిచింతలమడుగు తండా, అంపల్లి, ధారూరు గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. కులకచర్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి ఓటు వేయాలని జడ్పీటీసీ రాందా్‌సనాయక్‌ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. మందిపాల్‌, వీరాపూర్‌, తిర్మలాపూర్‌, బండమీది తండా, రాంపూర్‌, ఇప్పాయిపల్లిలో పర్యటించారు.


కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం 

కొడంగల్‌రూరల్‌/దౌల్తాబాద్‌/దోమ: కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీ నాయకులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కొడంగల్‌ మండల పరిధిలోని పెద్దనందిగామ, టేకుల్‌కోడ్‌, చిట్లపల్లి, అంగడిరైచూర్‌, అన్నారం గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే పి.నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. వామపక్ష పార్టీలు బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు పట్టభద్రులు ఓటు వేసి గెలిపించాలని న్యాయవాదులతో సీపీఐ జిల్లా కార్యదర్శి ఇందనూర్‌బషీర్‌ కోరారు. అదే విధంగా దౌల్తాబాద్‌, దేవరఫస్లాబాద్‌, గోకఫస్లాబాద్‌ తదితర గ్రామాల్లో పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. దోమలోని రాకొండలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో దోమ, బడెంపల్లి ఆయా గ్రామాల్లో ఆయా పార్టీల నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వాణీదేవిని గెలిపించాలని సర్పంచ్‌ రాజిరెడ్డి, గ్రంథాలయ జిల్లా డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌ కోరారు. 


బీజేపీ అభ్యర్థిని గెలిపించండి

తాండూరు రూరల్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావును గెలిపించాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్‌ కోరారు. కరణ్‌కోట్‌లో మండల అధ్యక్షుడు ఆంజనేయులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 


టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణను గెలిపించండి

నవాబుపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్‌.రమణను గెలపించాలని టీడీపీ మండల అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అన్నారు.  మండలంలో పార్టీ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. 


మేడ్చల్‌ జిల్లాలో.. 

ఘట్‌కేసర్‌ రూరల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి ఓటర్లును కోరారు. ప్రతా్‌పసింగారంలో సోమవారం ఆయన మహిళ దినోత్సవం సందర్బంగా మహిళ పట్టభద్రులను కలిసి శాలువాలతో సన్మానం చేసి మిఠాయిలు అందజేశారు.  

కేఎల్‌ఆర్‌ ప్రచారం

కీసర రూరల్‌: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారీటీతో గెలిపించాలని మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం దమ్మాయిగూడ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్‌ ముప్ప శ్రీలత నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, కేక్‌ కట్‌ చేశారు.  

బీజేపీతో భవిష్యత్తు

శామీర్‌పేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతోనే భవిష్యత్తుకు పునాదులు వేయాలని అసెంబ్లీ కో-కన్వీనర్‌ బోడ శ్రీనివా్‌సరావు అన్నారు. బొమ్మరాసిపేటలో సోమవారం  పార్టీ మండల అధ్యక్షుడు కైర యాదగిరి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  

Updated Date - 2021-03-09T06:05:57+05:30 IST