లేడీ డైరెక్టర్‌కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

Apr 23 2021 @ 09:01AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తుండగా..జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్ర బృందం హైదరాబాద్‌లో ఉగాది రోజున తాజా షెడ్యూల్ మొదలు పెట్టారు. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక చిత్ర యూనిట్ సభ్యులలో 5 మందికి కరోనా రావడంతో ప్రస్తుతానికి చిత్రీకరణ నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడితే త్వరలోనే మళ్ళీ షూటింగ్ రీ స్టార్ట్ చేయనున్నారు. 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా సర్కారు వారి పాట సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌కి కాస్త సమయం పడుతుండటంతో ఈ గ్యాప్‌లో మహేష్ మరొక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని న్యూస్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో స్టార్ డైరెక్టర్‌కి కూడా మహేష్ ఒకే చెప్పినట్టు తాజా సమాచారం. గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా సౌత్‌లో పాపులారిటీ తెచ్చుకున్న సుధ కొంగర దర్శకత్వంలో మహేష్ నటించే అవకాశాలున్నాయంటున్నారు. మరి ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ప్రాజెక్ట్ మొదలవుతుందా లేక సుధ కొంగర దర్శకత్వంలో చేసే ప్రాజెక్ట్ మొదలవుతుందా అన్నది త్వరలో క్లారిటీ రానుంది.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.