మమతా మోహన్ దాస్‌కు మెగా ఆఫర్ వచ్చిందా..?

May 8 2021 @ 10:43AM

మమతా మోహన్ దాస్‌కు మెగా ఆఫర్ వచ్చిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాలో నటించేందుకు మెగా కాంపౌండ్ నుంచి ఈమెకు పిలుపొచ్చిందట. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మమతా మోహన్ దాస్ ప్రస్తుతం 'లాల్ భాగ్' అనే త్రిభాషా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. మల్టీటాలెంటెడ్ అయిన మమత ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా టైటిల్ సాంగ్‌తో సింగర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు అందుకొని 'యమదొంగ', 'కేడి', 'చింతకాయల రవి' సినిమాలు చేసింది. కానీ టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ కనించలేదు. ఇంతకాలానికి తెలుగులో అవకాశం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీనా, ప్రియమణి వరసగా తెలుగు సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో మమత కూడా చేరుందా లేదా చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్‌లో ఆకలేస్తే అన్నం పెడతా అనే ఐటం సాంగ్ పాడింది మమతా మోహన్ దాస్‌.   

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.