పెళ్లి వద్దన్నాడు.. ఇంటినీ విడిచిపెట్టాడు.. గ్రామంలో అతను చేస్తున్న పనికి అంతర్జాతీయ గుర్తింపు.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..

ABN , First Publish Date - 2021-11-22T17:24:10+05:30 IST

అతనికి క్రీడలపై ఉన్న ఆసక్తితో..

పెళ్లి వద్దన్నాడు.. ఇంటినీ విడిచిపెట్టాడు.. గ్రామంలో అతను చేస్తున్న పనికి అంతర్జాతీయ గుర్తింపు.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..

అతనికి క్రీడలపై ఉన్న ఆసక్తితో పెళ్లి వద్దన్నాడు.. ఇంటినీ విడిచిపెట్టేశాడు. అయితే ఈ త్యాగమే అతనికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చింది. ఆ మధ్య జరిగిన టోక్యో ఒలింపిక్ లో సిల్వర్ మెడలిస్ట్ రవి దహియా, అర్జున్ అవార్దీ అమిత్ దహియాలతో పాటు 11 మంది అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన ఘనత అతనిది. ఇది హరియాణాలోని సోనీపత్ గ్రామానికి చెందిన హంసరాజ్ బ్రహ్మచారి కథ. ఆయన తన గ్రామాన్ని మల్లయోధుల గ్రామంగా మార్చివేశారు. అతని కృషి ఫలించి, అతని గ్రామం ఒలింపిక్ పతకాన్ని దక్కించుకుంది. 


ఈ సందర్భంగా హంసరాజ్ మాట్లాడుతూ.. తనకు మొదటి నుంచి మల్లయోధుడు కావాలని ఉండేదని, పాఠశాల స్థాయిలో నేషనల్ కుస్తీ గేమ్స్‌లో  గోల్డ్ మెడల్ దక్కించుకున్నానని తెలిపారు. గ్రామంలోని కుర్రాళ్లకు కుస్తీ విద్యను నేర్పేందుకు 1966లో ఒక కేంద్రాన్ని ప్రారంభించానన్నారు. ఇంటిని విడిచిపెడితేనే ఈ కేంద్రం బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేర్చగలనని అనిపించడంతో 2000వ సంవత్సరంలో ఇంటికి దూరమయ్యానన్నారు. కుస్తీ కేంద్రాన్ని మరింతగా విస్తరింపజేశానని, ప్రస్తుతం ఈ కేంద్రంలో మొత్తం 150 మంది యువకులకు శిక్షణ అందిస్తున్నానని తెలిపారు. తన శిష్యులలోని పలువురు అంతర్జాతీయ పోటీలలో రాణిస్తున్నారని, ఇది తనకు ఎంతో ఆనందం కలిగిస్తున్నదన్నారు.



Updated Date - 2021-11-22T17:24:10+05:30 IST