సెల్ఫీతో గుండె సమస్యను గుర్తించవచ్చని తెలుసా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

ABN , First Publish Date - 2021-11-14T22:54:48+05:30 IST

సెల్ఫీతో ఫొటో మాత్రమే కాదు.. గుండె సమస్యను కూడా గుర్తించవచ్చట. సెల్ఫీతో ప్రత్యేకంగా ఒక వ్యాధిని గుర్తించే సాంకేతికను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన సమాచారం తాజా పరిశోధనలో వెల్లడైంది.

సెల్ఫీతో గుండె సమస్యను గుర్తించవచ్చని తెలుసా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

నేటి యువతకు సెల్ఫీల పిచ్చి ఎంత పీక్స్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పొద్దున నుంచి సాయత్రం వరకూ జరిగే ప్రతి క్షణాన్నీ సెల్‌ఫోన్‌లో బంధించాలని తాపత్రయపడుతుంటారు. అవకాశం దొరికితే చాలు.. ఫోన్ తీసుకుని క్లిక్‌మనిపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు కోకొల్లలు. కేవలం మంచి సెల్ఫీల కోసమే.. ఎంతో ఖర్చు చేసి ఫోన్లు కొంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం అదే సెల్ఫీతో గుండె సమస్యలను గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు..


సెల్ఫీతో ఫొటో మాత్రమే కాదు.. గుండె సమస్యను కూడా గుర్తించవచ్చట. సెల్ఫీతో ప్రత్యేకంగా ఒక వ్యాధిని గుర్తించే సాంకేతికను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన సమాచారం తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యాయనానికి సంబంధించిన వివరాలు.. యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. ముఖ కవలికలు, కనురెప్పలు, చర్మం ముడతలు తదితరాలను ఫొటో తీయడం ద్వారా గుండె జబ్బులను గుర్తించవచ్చని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత.. ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారని తెలిసింది. గుండెను స్నానింగ్ చేసే యంత్రంగా ఫోన్‌ను ఆధునికీకరిస్తున్నారట.


ఒక వ్యక్తికి సంబంధించిన నాలుగు ఛాయాచిత్రాలను విశ్లేషించడం ద్వారా కొరోనరీ ఆర్టరీ అనే వ్యాధిని గుర్తించే విధంగా అధ్యయనాలు చేస్తున్నారు. గుండె పనితీరును సెల్ఫీ ద్వారా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్క్రీనింగ్ చేయొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ జె జెంగ్.. చైనాలోని ఫువాయ్ అనే ప్రముఖ ఆస్పత్రికి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. గుండె జబ్బులపై అంచనా వేసేందుకు లోతైన పరిశోధన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


తక్కువ ఖర్చుతో గుండె సమస్యను గుర్తించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం చాలా మంది రోగులను పరీక్షించినట్లు తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా కొందరు నర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారట. డిజిటల్ కెమెరాలతో ముఖ కవలికలను నాలుగు విభాలుగా ఫొటో తీసి.. తద్వారా గుండె జబ్బుల స్థాయిని అంచనా వేసేందుకు పరిశోధన చేస్తున్నారు. 2019 ఏప్రిల్, జూలై మధ్య చైనాలోని తొమ్మిది ఆస్పత్రుల నుంచి 1,013 మంది రోగులపై పరిశోధన చేశారని తెలిసింది.

Updated Date - 2021-11-14T22:54:48+05:30 IST