Alia Bhatt: సోషల్ మీడియా పోస్ట్‌కు ఆలియా ఎంత ఛార్జ్ చేస్తుందంటే

Published: Sun, 07 Aug 2022 19:08:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Alia Bhatt: సోషల్ మీడియా పోస్ట్‌కు ఆలియా ఎంత ఛార్జ్ చేస్తుందంటే

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఆలియా భట్ (Alia Bhatt)ఒకరు. చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారింది. కెరీర్ ప్రారంభించినప్పుడు అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనంతరం ‘టూ స్టేట్స్’, ‘హైవే’, ‘రాజీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ‘గంగూబాయి కతియా వాడి’, ‘డార్లింగ్స్’ (Darlings) మూవీస్‌తో అబ్బురపరిచింది. ఆలియాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 68.5 మిలియన్ ఫాలోయర్స్ అనుసరిస్తున్నారు. ట్విట్టర్‌లో 21.5మిలియన్ మంది ఫాలోయర్స్ ఉన్నారు. అందువల్ల ఆలియా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ చాలా ఖరీదైందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.    


ఆలియా భట్ సోషల్ మీడియాలో పోస్ట్, యాడ్‌ పెట్టాలంటే రూ. 85లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించుకోవాలట. సినిమా విడుదల సమయంలో ఈ ధర మరింత పెరుగుతుందట. తాజాగా ‘డఫ్ అండ్ పెల్ఫ్స్’ సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూను లెక్కించింది. ఆ రిపోర్టు ప్రకారం 2021లో ఆమె బ్రాండ్ విలువ 68. 1 మిలియన్ డాలర్లు. ఈ రిపోర్టులోని టాప్-10 సెలబ్రిటీల జాబితాలోను ఆలియా చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న పిన్న వయస్కురాలు ఆలియానే కావడం గమనార్హం. తాజాగా ఆలియా ‘డార్లింగ్స్’లో నటించింది. ఈ సినిమాకు షారూఖ్ ఖాన్‌తో పాటు ఆలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాంలోనే విడుదలైంది. ‘డార్లింగ్స్’ ఓటీటీ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ రూ. 80కోట్లు చెల్లించిందని తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు 5 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో విజయ్ వర్మ (Vijay Varma), షెఫాలీ షా, రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...