Vijay Deverakonda: ‘లైగర్’ లో మొదట హీరోయిన్ ఎవరంటే

Published: Wed, 17 Aug 2022 19:18:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Vijay Deverakonda: లైగర్ లో మొదట హీరోయిన్ ఎవరంటే

విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన సినిమా ‘లైగర్’ (Liger). అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించాడు. పూరీ కనెక్ట్స్‌తో కలసి ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ‘లైగర్’ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరీ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంగతిని అభిమానులతో పంచుకున్నాడు. 


‘లైగర్’ లో హీరోయిన్ పాత్ర‌ను జాన్వీ కపూర్‌(Janhvi Kapoor) తో చేయిద్దామనుకున్నానని పూరీ జగన్నాథ్ తెలిపాడు. కానీ, అనివార్య కారణాల వల్ల జాన్వీ ఆ పాత్రను చేయలేకపోయిందని చెప్పాడు. ‘‘శ్రీదేవి గారికీ నేను వీరాభిమానిని. అందువల్ల ‘లైగర్’ లో జాన్వీ కపూర్‌ను తీసుకోవాలనుకున్నాం. కానీ, ఆమె డేట్స్ అందుబాటులో లేవు. కరణ్ జోహార్‌ కథను విన్నాక అనన్య పాండే పేరును సూచించాడు. నేను లైగర్ కథను పదేళ్ల క్రితమే రాశాను. విజయ్ దేవరకొండకు ఐడియాను వినిపించగానే ఎంతో ఆసక్తి చూపించాడు. నేను రెండు కథలు చెప్పినప్పటికీ ‘లైగర్’ అతడికీ ఎంతగానో నచ్చింది. ఈ కథను ముందుగా చేద్దామని చెప్పాడు’’ అని పూరీ జగన్నాథ్ తెలిపాడు. ఉత్తర భారతదేశంలో ‘లైగర్’ ప్రమోషన్స్‌లో విజయ్ దేవర కొండకు అద్భుతమైన స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. అందుకు గల కారణాన్ని కూడా పూరీ జగన్నాథ్ వివరించాడు. ‘‘ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే పలు మాల్స్‌ను సందర్శించారు. ఈ ఈవెంట్స్‌కు వచ్చిన స్పందన చూసి సంతోషమేసింది. ‘అర్జున్ రెడ్డి’ లో విజయ్ నటనకు అందరు ఫిదా అయ్యారు. అప్పటి నుంచే అతడిని ప్రేమించడం మొదలుపెట్టారు’’ అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నాడు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...