వాట్సాప్‌లో ఈ అప్‌డేట్స్‌ తెలుసా

ABN , First Publish Date - 2021-04-17T06:07:40+05:30 IST

ఇప్పుడు వాట్సాప్‌ వినియోగించని వారు అరుదు. అందులో యూజర్లకు అవసరమైన ఎన్నో టెక్నాలజీలను యాడ్‌ చేస్తూనే ఉంటుంది

వాట్సాప్‌లో ఈ అప్‌డేట్స్‌ తెలుసా

ఇప్పుడు వాట్సాప్‌ వినియోగించని వారు అరుదు. అందులో యూజర్లకు అవసరమైన ఎన్నో టెక్నాలజీలను యాడ్‌ చేస్తూనే ఉంటుంది. సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ‘కాల్‌ వెయిటింగ్‌’ విషయమై ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. అయితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులకు వాట్సాప్‌లో నూ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో వాయిస్‌ లేదంటే వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో మరొకరు లైన్‌లోని వస్తే, ఆ సంగతి నోటిఫికేషన్‌ ద్వారా తెలుస్తుంది. చేస్తున్న కాల్‌ని ఆపి వెయిటింగ్‌లో ఉన్న దానికి ఆన్సర్‌ చేయాలా, వద్దా అన్నది వినియోగదారుడి చాయిస్‌ మాత్రమే. 


వినియోగదారుడు కాల్‌ చేసినప్పుడు సదరు వ్యక్తి అప్పటికే మాట్లాడుతూ ఉంటే బిజీ టోన్‌కు తోడు ‘ఆన్‌ అనదర్‌ కాల్‌’ అని పాపప్‌ కనిపిస్తుంది.వినియోగదారుడు తను మాట్లాడుతున్నా, మరొకరు సంభాషిస్తున్నా ఆన్‌లైన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు యాప్‌ను క్లోజ్‌ చేసి సంభాషణ కొనసాగించవచ్చు. అప్పుడు మీరు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌లో ఉన్నట్టు వేరేవారికి తెలియదు. వాట్సాప్‌లో కాల్స్‌, మెసేజ్‌లు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్ర్కిప్ట్‌ అయి  ఉంటాయి. అందువల్ల వేరే వ్యక్తులు మీ మెసేజ్‌లు చూసే లేదా మాటలు వినే అవకాశం ఉండదు. ఎవరికైనా ఫోన్‌ చేసినప్పుడు ఆ వ్యక్తి డేటా ఆఫ్‌లో ఉన్నప్పుడు మొబైల్‌ స్ర్కీన్‌పై ‘కాలింగ్‌’ అని కనిపిస్తుంది. అదే ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉంటే ‘రింగింగ్‌’ అని చూపిస్తుంది. ఎవరైన వ్యక్తులు తమ కాంటాక్ట్‌లోని ఒక నెంబర్‌ను బ్లాక్‌ చేశారా లేదా అన్నది కూడా ఇప్పుడు తెలుసుకోవచ్చు. బ్లాక్‌ చేసిన వ్యక్తి తాలూకా ‘కాంటాక్ట్‌ లాస్ట్‌ సీన్‌’ లేదా చాట్‌ విండోను చూడలేరు. కాంటాక్ట్‌ ప్రొఫైల్‌ ఫొటో, ఇంకా ఆ వ్యక్తులు చేసే అప్‌డేట్స్‌ బ్లాక్‌ అయినవారికి కనిపించవు. మీరు ఆ నెంబర్‌కు పంపిన మెసేజ్‌పై కూడా ఒకటే చెక్‌ మార్క్‌ కనిపిస్తుంది.  

Updated Date - 2021-04-17T06:07:40+05:30 IST