కస్పా-గౌరీపట్నం రోడ్డులో కష్టాలు!

ABN , First Publish Date - 2022-05-19T06:41:51+05:30 IST

వడ్డాది వంతెన కుంగిపోవడంతో అధికారులు ట్రాఫిక్‌ను కస్పా- గౌరీపట్నం రోడ్డు మీదుగా చోడవరానికి మళ్లించారు. ఇందులో భాగంగా సదరు రోడ్డు అభివృద్ధికి కాంట్రాక్టర్‌ రోడ్డు మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర మెటల్‌ వేశారు. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

కస్పా-గౌరీపట్నం రోడ్డులో కష్టాలు!
రాళ్లు తేలిన కస్పా రోడ్డు

  వడ్డాది వంతెన కుంగడంతో ట్రాఫిక్‌ను మళ్లించిన అధికారులు

 అభివృద్ధి పనుల్లో భాగంగా 4 కి.మీ. మేర మెటల్‌ వేసేసిన కాంట్రాక్టర్‌

 రాకపోకలకు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న వాహనచోదకులు

బుచ్చెయ్యపేట, మే 18 : వడ్డాది వంతెన కుంగిపోవడంతో అధికారులు ట్రాఫిక్‌ను కస్పా- గౌరీపట్నం రోడ్డు మీదుగా చోడవరానికి  మళ్లించారు. ఇందులో భాగంగా సదరు రోడ్డు అభివృద్ధికి కాంట్రాక్టర్‌  రోడ్డు మొత్తం నాలుగు కిలోమీటర్ల మేర మెటల్‌ వేశారు. దీంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.  వడ్డాది వంతెన కుంగిపోవడంతో అనకాపల్లి, చోడవరం, విశాఖ పట్నా నికి వెళ్లేందుకు వాహనదారులు కస్పా రోడ్డునే ఆశ్రయిస్తున్నారు. అయితే రోడ్డు మొత్తం మెటల్‌ వేసి వదిలేయడంతో ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. ఆరు కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులు రూ.71 లక్షల అంచనా వ్యయంతో టెండరును ఖరారు చేశారు. గౌరీపట్నం నుంచి కిలో మీటరు అభివృద్ధి చేసిన కాంట్రాక్టరు మిగిలిన నాలుగు కిలోమీటర్ల రోడ్డుపై మెటల్‌ వేసి వదిలేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాళ్లు తేలిన రహదారిపై ప్రయాణాలు ఎలా చేయమంటారని ప్రశ్నిస్తున్నారు. కస్పా- గౌరీపట్నం రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బి ఇంజనీరింగ్‌ అధికారులను అంతా కోరుతున్నారు.

Updated Date - 2022-05-19T06:41:51+05:30 IST