ఇలా చేయండి!

ABN , First Publish Date - 2021-02-28T08:28:52+05:30 IST

జీర్ణపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే ఆహారం తినేముందే అప్రమత్తంగా ఉంటే చాలా వరకు జీర్రక్రియ సంబంధ వెతలు తప్పుతాయి.

ఇలా చేయండి!

జీర్ణపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే ఆహారం తినేముందే అప్రమత్తంగా ఉంటే చాలా వరకు జీర్రక్రియ సంబంధ వెత జీర్రక్రియ సంబంధ వెతలు తప్పుతాయి. అంతేకాదు తినే ఆహారంలో శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచే సైన్స్‌ ఉందంటున్నారు వైద్యనిపుణులు. 


ఆకలిగా అనిపించినప్పుడే తినడం ఒక మంచి అలవాటు. తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తరువాతే ఆకలి వేస్తుంది. అయితే ఒక్కోసారి డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా ఆకలిగా అనిపిస్తుంది. అందుచేత శరీరం ఇచ్చే ఆకలి సంకేతాలను గమనించడం చాలా ముఖ్యం.

ప్రశాంతంగా, సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో కూర్చొని తినాలి. ఽధ్యాసంతా భోజనం మీదే ఉండాలి. సాధ్యమైనంత వరకు టీవీ, ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌ ముందు కూర్చోవడం లేదా పుస్తకం చదువుతూ తినడం చేయకూడదు.

ఆహారం శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. బాగా పొడిగా, ఎక్కువ నూనె ఉండే కూరలు కాకుండా సూప్‌ ఉన్న కూరలతో కూడిన భోజనం తేలిగ్గా జీర్ణమవుతుంది. శరీరం పోషకాలను తొందరగా గ్రహిస్తుంది. పొట్ట నిండిన సంతృప్తి అనిపించగానే తినడం ఆపేయాలి. 

కొన్ని రకాల ఆహారపదార్థాలను కలిపి తీసుకోవద్దు. ఉదాహరణకు పండ్లు, పాలు లేదా చేపలు, పాలు కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ లయ తప్పుతుంది. 

వేడివేడి ఆహారం తినేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఫ్రిజ్‌లోంచి తీసిన ఫుడ్‌ తినడం తగ్గిస్తే జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. బాగా చల్లగా, బాగా వేడిగా ఉండని ఆహారం తింటే జీర్రకియ ఎంజైమ్‌లు చురుకుగా పనిచేస్తాయి.

Updated Date - 2021-02-28T08:28:52+05:30 IST