ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు: కేటీఆర్

ABN , First Publish Date - 2022-04-05T00:58:44+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మంత్రి

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు: కేటీఆర్

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని తారామతి బారాదరిలో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 21-22 కార్యక్రమం జరిగింది. దీనిలో కేటీఆర్  పాల్గొని మాట్లాడారు. కరోనా తరువాత ఇంత పెద్దఎత్తున స్కూళ్ళు ఇన్నోవేషన్‌లో పాల్గొన్నాయన్నారు. మొత్తం 5,387 స్కూళ్ళు,11,037 ఐడియాలతో 25,166 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అందులో ఐదు స్కూళ్ళు బహుమతి పొందాయన్నారు. ఇలాంటి ఇన్నివేషన్లు ఇంకా రావాలని ఆయన ఆకాంక్షించారు.


పిల్లల్లో సృజనాత్మకత వెలికితీస్తేనే వాళ్ళ ప్రతిభ బయట పడుతుందన్నారు. కొత్త కొత్త వస్తువులను తయారీ చేసే విధానం చిన్నతనం నుండే నేర్పించాలని ఆయన సూచించారు. పిల్లలకు బియ్యం, పాలు ఎక్కడి నుండి వస్తేన్నాయో ఇక్కడ పిల్లలకు తెలియదన్నారు. ఇవన్నీ వాళ్ళకి నేర్పాలి, చూపించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో పిల్లలకు ఇబ్బందులు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఇక్కడ ఎన్నో రకాల ప్రయోగాలు చేశారన్నారు. రిచ్ అనే సంస్థతో సైన్స్, టెక్నాలజీ ఈ రెండు ప్రయోగాల ఆలోచనలు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మన ఊరు మన బడి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారబోతున్నాయన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి పాఠశాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలానుగుణంగా మన ఉపాధ్యాయులు కూడా అప్‌గ్రేడ్ కావాలన్నారు. టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్ కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-04-05T00:58:44+05:30 IST