Driving license విషయంలో మళ్లీ నిబంధనలు మార్చిన కువైత్!

ABN , First Publish Date - 2021-11-29T18:03:34+05:30 IST

డ్రైవింగ్ లైసెన్స్‌ విషయంలో కువైత్ ప్రభుత్వం తాజాగా మళ్లీ నిబంధనలు మార్చింది. వాహనాలు నడిపే సమయంలో ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరికాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

Driving license విషయంలో మళ్లీ నిబంధనలు మార్చిన కువైత్!

ఎన్నారై డెస్క్: డ్రైవింగ్ లైసెన్స్‌ విషయంలో కువైత్ ప్రభుత్వం తాజాగా మళ్లీ నిబంధనలు మార్చింది. వాహనాలు నడిపే సమయంలో ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరికాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కువైత్‌లో వాహనాలు నడపాలంటే.. కేవలం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోదని.. ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా చోదకులు తప్పనిసరిగా కలిగి ఉండాలని కొద్ది రోజుల క్రితం కువైత్ ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. అయితే తాజాగా ఆ ఆదేశాలను సవరించింది. డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పని లేదని స్పష్టం చేసింది. కువైత్ పౌరులు, నివాసితులకు అందుతున్న సేవలను సులభతరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కువైత్ ప్రభుత్వం వెల్లడించింది. 




Updated Date - 2021-11-29T18:03:34+05:30 IST