Digital Love.. ఎమోజీలు కలిస్తే ఎమోషన్స్‌ ముందుకు.. ఇలా వెరైటీగా Propose చేయండి..!

ABN , First Publish Date - 2022-02-14T17:14:56+05:30 IST

తొలిచూపులోనే ప్రేమ అనే కాలం పోయింది. ఒక్క ట్వీట్‌తోను ప్రేమలో పడేయవచ్చనే కాలమిది. నేటి డిజిటల్‌ యుగంలో ప్రేమలో పడటం ఎంత సులభమో..

Digital Love.. ఎమోజీలు కలిస్తే ఎమోషన్స్‌ ముందుకు.. ఇలా వెరైటీగా Propose చేయండి..!

తొలిచూపులోనే ప్రేమ అనే కాలం పోయింది. ఒక్క ట్వీట్‌తోను ప్రేమలో పడేయవచ్చనే కాలమిది. నేటి డిజిటల్‌ యుగంలో ప్రేమలో పడటం ఎంత సులభమో.. కాపాడుకోవడం కూడా కష్టంగా మారింది. ముఖాముఖి మాటలు తగ్గాయి. వాట్సాప్‌ లేదంటే సామాజిక మాధ్యమాల  ఊసులు ఎక్కువయ్యాయి. ఎన్ని మారినా ప్రేమను వ్యక్తీకరించేవి మాత్రం కొన్నే అంటున్నారు రిలేషన్‌షిప్‌ కౌన్సిలర్లు. అవి సేవా గుణం, బహుమతులు, నాణ్యమైన సమయం, భౌతిక స్పర్శ, ప్రేమను నిర్ధారించే పదాలు అంటే ప్రతిజ్ఞలు. వీటినే ప్రేమ భాషలని అంటున్నారు. ప్రేమలో ఉన్న వారెవరైనా ఈ భాషల్లో ఏదో ఒకటి వాడాల్సిందే అని పేర్కొంటున్నారు. 


హైదరాబాద్‌ సిటీ : ప్రేమించాలి.. అర్థం చేసుకోవాలి.. అనేది పాతతరం మాటగా మారింది. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే... అనేది నేటి తరం లవ్‌ డెఫినేషన్‌ అయింది. అందుకే డేటింగ్‌ యాప్‌లు పెరుగుతున్నాయి. వెదకడం, సరిపోల్చుకోవడం, చాట్‌ చేయడం... అంతే. ఎమోజీలు కలిస్తే ముందుకు, లేదంటే చాట్‌ బాక్స్‌ క్లోజ్‌ అవుతోంది. 



ఐ లవ్‌ యూ లాంటి రొటీన్‌ వద్దు..

డిజిటల్‌ యుగంలో కూడా ప్రేమను ఒకే రకంగా చెప్పాలా, పలు భాషల్లో వ్యక్త పరచాలంటే ఎలా.. అనుకునే వారికి పలు దేశాల భాషలను ఆన్‌లైన్‌లోనే నేర్పుతున్న వెబ్‌సైట్‌లు/యాప్‌లు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి డ్యుయోలింగో (Duo-l-ingo). దాదాపు 40 భాషలలో శిక్షణ ఇచ్చే ఈ యాప్‌ వాలెంటైన్స్‌ డే వేళ ప్రేమను పలు భాషల్లో ఎలా వ్యక్తీకరించవచ్చో చెబుతుంది. ఐ లవ్‌ యు లేదంటే ఇలు (ILU) అనే రొటీన్‌ పదాలకు బదులుగా వైవిధ్యంగా ప్రేమను ఎలా చెప్పొచ్చో సూచిస్తుంది.


ప్రేమను ఎలా వ్యక్తం చేయాలంటే..

నేడు ప్రేమికుల దినోత్సవం.. 

ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది.. అనే లోపే ఇంకొకరు చేతిలో చెయ్యేసి చెప్పేయ్యనా.. అంటూ ప్రేమను వెల్లడించే కాలమిది. ప్రేమ గెలవాలంటే ముందు అమ్మాయి/అబ్బాయి మనసును స్టడీ చేయాలి అంటున్నారు సైకాలజిస్ట్‌ అనురాధ. కొంతమంది మాటలకు ప్రభావితమవుతారు. మరికొంతమంది మనలోని సేవాగుణాన్ని ఇష్టపడతారు. ఇంకొందరు బహుమతులు ఇస్తే చాలనుకుంటారు. ఎవరెంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. 


మీటప్స్‌ ఉన్నాయ్‌ డూడ్‌.. 

ప్రేమంటే.. చూపులు కలవాలి. మెరుపులు రావాలి. మనసులు మురియాలి. అదేమీ లేకుండా ప్రేమా అని నిట్టూర్చాల్సిన అవసరం లేదు. తమ ప్రేమ కోసం గతంలోలా వేచి చూడాల్సిన అవసరం లేదిప్పుడు. మీటప్స్‌ ఉన్నాయి. వాలెంటైన్స్‌ డే పేరు చెప్పగానే సింగిల్స్‌ కోసం ఈవెంట్లు నగరంలో భారీగానే ప్లాన్‌ చేస్తారు. అయితే మోరల్‌పోలీసుల దెబ్బకు కాస్త సైలెంట్‌గా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 


నిజాయితీ ఉండాలి..

ప్రేమంటే భయపడే వారి మదిని గెలవాలంటే వారికి నమ్మకం కలిగించే రీతిలో మాటలు, చేతలు ఉండాలి. నిజాయితీ లేకపోతే ఇలాంటి వారి ప్రేమ పొందడం కష్టం. అలాగని సూటిగా చెప్పడమూ వీరికి నచ్చదు. ఆమెను ఎంత కేర్‌గా చూసుకుంటారనేది ప్రతిజ్ఞలా చెప్పాలి. సేవాగుణం ఇష్టపడే వారికి మీరేం చేస్తారో చెబితే నచ్చదు. చేసి చూపాల్సిందే. అదే సమయంలో వారి అవసరాలను తీర్చడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. బహుమతులిచ్చి అబ్బాయి/అమ్మాయి ప్రేమను గెలవడం కొంతవరకే సాఽధ్యం. కానీ కొందరిని గెలిచే అవకాశామూ ఉంది. ఇప్పుడు చాలా మందివి ఒంటరి బతుకులే. తానున్నాననే భరోసా, తన కోసం సమయం వెచ్చిస్తాననే నమ్మకం కలిగిస్తే కొందరి ప్రేమను గెలవచ్చు. అందుకోసం డిజిటల్‌ యుగంలో మొబైల్‌ స్ర్కీన్‌కు అతుక్కుపోక తప్పదు. ఎంత డిజిటల్‌ యుగమైనా కనెక్టివిటీ లేకపోతే కష్టమే. నెట్‌వర్క్‌ సరిగా లేదంటే తనను దూరం పెడుతున్నారని అపోహ పడే కాలం కాబట్టి అప్పుడప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోవాలి.

Updated Date - 2022-02-14T17:14:56+05:30 IST