హోల్‌సేల్‌, రిటైల్‌ల్లో... డిజిటల్ రూపీ

ABN , First Publish Date - 2021-07-23T23:47:35+05:30 IST

ఇక డిజిటల్ కరెన్సీ రాబోతోంది. ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) త్వరలో ఓ డిజిటల్‌ కరెన్సీని పరిచయం చేయబోతోంది.

హోల్‌సేల్‌, రిటైల్‌ల్లో... డిజిటల్ రూపీ

ముంబై : ఇక డిజిటల్ కరెన్సీ రాబోతోంది. ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) త్వరలో ఓ డిజిటల్‌ కరెన్సీని పరిచయం చేయబోతోంది. దీనిని  దశలవారీగా చలామణిలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో పైలెట్‌ ప్రాజెక్టుల్లో భాగంగా కరెన్సీని హోల్‌సేల్‌, రిటైల్‌ విభాగాల్లో ప్రవేశపెట్టేందుకు చర్చలు జరుగుతున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టీ. రవిశంకర్‌ తెలిపారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు హోల్‌సేల్‌, రిటైల్‌ సెగ్మెంట్లలో తమ డిజిటల్‌ కరెన్సీలను వాడుకలోకి తెచ్చాయని ఆయన గుర్తుచేశారు. 

Updated Date - 2021-07-23T23:47:35+05:30 IST