‘డిజిటల్ లావాదేవీ’లు... 12 నెలలు... 53 శాతం పెరిగిన వృద్ధి రేటు...

Dec 6 2021 @ 19:00PM

న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత్‌లో డిజిటల్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ(2021) ఏడాదిలో నమోదైన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సర కాలంలో చెల్లింపుల పరిమాణంలో భారతదేశం వృద్ధి రేటు వాల్యూమ్ నిబంధనలకు సంబంధించి 53 శాతం, విలువ నిబంధనలకు సంబంధించి 28 శాతం మేర పెరుగుదల నమోదైంది. కరోనా నేపధ్యంలో కూడా... గత సంవత్సరమున్నర కాలంలో... రియల్ టైం గ్రాస్ సెటిల్‌మెంట్స్, డిజిటల్ చెల్లింపులు సహా చెల్లింపుల లావాదేవీల పరిమాణం, విలువల్లో... భారీ పెరుగుదల నమోదైంది. గత పన్నెండు నెలల్లో... కనీసం 21.79 కోట్ల లావాదేవీలు నడిచాయి. 


చెల్లింపుల లావాదేవీల వృద్ధిరేటుగతంలోనైతే వాల్యూంపరంగా 53 శాతం, విలువపరంగానైతే 28 శాతం పెరిగింది. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్‌లో  ఆర్‌బీఐ పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ సిస్టమ్స్ విభాగం ఛీఫ్ జనరల్ మేనేజర్ పి. వాసుదేవన్ మాట్లాడుతూ ‘గత అయిదేళ్ళలో సమ్మేళన వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) వాల్యూంపరంగా 42 శాతంగా ున్న నేపధ్యంలో... గత ఐదేళ్ళతో పోల్చినపక్షంలో... గత పన్నెండు నెలల్లో అధిక వృద్ధి చోటుచేసుకుంది. రోజువారీ ప్రాతిపదికన 21.79 కోట్ల చెల్లింపుల లావాదేవీల ప్రాసెసింగ్ జరిగింది. ఇదే ఒరవడిని కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.


ఎన్‌ఏసీహెచ్, భారత్ బిల్ పేమెంట్ తదితర చెల్లింపు విధానాలు... వారాంతాల్లో కూడా లావాదేవీల నిర్వహణకు వీలు కల్పించాయన్నారు. కాగా... సెటిల్‌మెంట్లు ఒక వారంలో 200 శాతం మర పెరిగాయన్నారు. ఇదిలా ఉంటే... యూపీఐ వాల్యూంలలో 65 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగిన నేపధ్యంలో... రూ. 4 బిలియన్ల ఆల్‌టైం గరిష్ట స్థాయి లావాదేవీలు నమోదు కావడం విశేషం. నిరుడుతో పోలిస్టే... ఈ ఏడాది... జులై-సెప్టెంబరు త్రైమాసికంలో  103 శాతం పెరుగుదల నమోదైంది. లావాదేవీల విలువలో కూడా వంద శాతం వృద్ధి చోటుచేసుకుంది. 


కాగా... యూపీఐ లావాదేవీలకు సంబంధించి కనీసం 54 శాతం వ్యక్తిగతమైనవి కాగా, 46 శఆతం లావాదేవీలు వ్యక్తులు-వ్యాపారులకు సంబంధించినవి. కాగా... ఈ ఏడాది సెప్టెంబరు నాటికి యూపీఐ సేవలనందిస్తోన్న బ్యాంకుల సంఖ్య 259. ఇండియా ‘డిజిటల్ చెల్లింపులు’ పేరుతో వరల్డ్ లైన్ ఇండియా సంస్థ రూపొందించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులు 2019 ఏప్రిల్ లో 3,154 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపులు... ఈ ఏడాది నవంబరు వరకు 4.683 కోట్లకు చేరుకున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పార్లమెంటులో వెల్లడించారు. కాగా... డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య మరింత పెరగాల్సి ఉందని, ఆ క్రమంలోనే... ఆర్ధికపరమైన లావాదేవీలకు సంబంధించి, ప్రత్యేకించి... నగదు లావాదేవీల విషయంలో చోటుచేసుకునే అవకతవకలకు కళ్ళెం పడుతుంన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.   


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.