శిథిలమైన పోలీస్‌ క్వార్టర్స్‌

ABN , First Publish Date - 2021-06-20T05:33:19+05:30 IST

మిడుతూరు మండలం కేంద్రంలో నిర్మించిన పోలీసు క్వార్టర్స్‌ శిథిలమై, భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది.

శిథిలమైన పోలీస్‌ క్వార్టర్స్‌
మిడుతూరులో నిరుపయోగంగా పోలీసు క్వార్టర్స్‌

  1. 18ఏళ్లుగా నిరుపయోగంగా భవనాలు
  2. అద్దె భవనాల్లో సిబ్బంది నివాసం
  3. పట్టించుకోని పోలీ్‌సశాఖ 


మిడుతూరు, జూన్‌ 19: మిడుతూరు మండలం కేంద్రంలో నిర్మించిన పోలీసు క్వార్టర్స్‌ శిథిలమై, భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్వార్టర్స్‌ భవన సమూదాయం నిర్మించిన 10 ఏళ్లకే నిరుపయోగంగా మారింది. పనిచేసే చోట నివాసం ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా పోలీసుశాఖ మండల కేంద్రాలలో  క్వార్టర్స్‌ను నిర్మించింది. మిడుతూరు పోలీ్‌సస్టేషన్‌ ప్రాంగణంలో 1991లో పోలీసు సిబ్బంది నివాసం కోసం 8 గదులతో కార్టర్స్‌ సముదాయం నిర్మించారు. 10 ఏళ్లపాటు సిబ్బంది కార్టర్స్‌లో నివాసం ఉన్నారు. 2001 నుంచి సిబ్బంది పిల్లల చదువులు, ఆరోగ్య పరిస్థితుల రీత్యా సమీపంలో నందికొట్కూరు, కర్నూలు పట్టణాలకు వెళ్లిపోయారు. కార్టర్స్‌లో సిబ్బంది నివాసం ఉండకపోడం, నిర్వహణ పట్టించుకోకపోడంతో నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. భవనం నిరుపయోగంగా ఉండి 19 ఏళ్లు గడుస్తున్నా పోలీసుశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. భవనం పెచ్చులూడిపోయింది. గదులకు తలుపులు ఊడిపోయాయి. పనిచేసే చోట పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం సరైన వసతులను కల్పించకడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో సిబ్బంది అద్దెభవనాల్లో అరకొర వసతులతో జీవిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసుశాఖ అధికారులు స్పందించి మండల కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మౌలిక వసతులతో కూడిన  నివాస గృహాలను ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.



Updated Date - 2021-06-20T05:33:19+05:30 IST