ఇంటికి చేరిన దిలీప్‌ కుమార్‌!

Jun 11 2021 @ 17:26PM

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. గత నెల కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వల్ల ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే! దాదాపు నెల రోజుల చికిత్స తర్వాత ఆయన డిశ్చార్జ్‌ అయ్యారు. శుక్రవారం ఆసుపత్రి బయట ఆయన భార్య సైరాభాను మీడియాతో మాట్లాడారు. ‘‘దిలీప్‌ ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లు ఆయన్ను బాగా రెస్ట్‌ తీసుకోమని, కొన్ని యాంటి బయాటిక్స్‌ రెగ్యులర్‌గా వాడమని చెప్పారు.  ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులు అందరికీ, చికిత్స అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు’’ అని ఆమె అన్నారు. దిలీప్‌కుమార్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఆయన ఆరోగ్యం కోసం దైవాన్ని ప్రార్థించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.