TS DEE సెట్‌ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-05-27T23:56:56+05:30 IST

డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(Diploma in Elementary Education)(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన డీఈఈ(DEE) సెట్‌ 2022 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తెలంగాణలోని ప్రభుత్వ డైట్‌..

TS DEE సెట్‌ నోటిఫికేషన్‌

డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(Diploma in Elementary Education)(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఉద్దేశించిన డీఈఈ(DEE) సెట్‌ 2022 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా తెలంగాణలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలు సహా ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌ మైనారిటీ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌లలో అడ్మిషన్స్‌ ఇస్తారు. ప్రతి కళాశాలలో 80 శాతం ‘ఎ’ కేటగిరీ సీట్లు, 20 శాతం ‘బి’ కేటగిరీ సీట్లు ఉంటాయి. ‘ఎ’ కేటగిరీ సీట్లను సింగిల్‌ విండో సిస్టమ్‌ ద్వారా ‘బి’ కేటగిరీ  సీట్లను కళాశాలల యాజమాన్యం నిర్ణయం మేరకు భర్తీ చేస్తారు. 85 శాతం సీట్లను స్థానికులకు నిర్దేశించారు. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు.


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన/రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు సెప్టెంబరు 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.   

డీఈఈ సెట్‌ వివరాలు: డీఈఈ సెట్‌ను తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. డీఈఎల్‌ఈడీ ప్రోగ్రామ్‌ ఈ మూడు మాధ్యమాల్లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌ కోసం ఎంచుకొన్న మాధ్యమంలోనే డీఈఈ సెట్‌ రాయాల్సి ఉంటుంది. డీపీఎస్‌ఈ ప్రోగ్రామ్‌ ఇంగ్లీష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఇందులో చేరాలనుకొనేవారు డీఈఈసెట్‌ను ఇంగ్లీష్‌ మాధ్యమంలోనే రాయాలి. ఆంగ్ల మాధ్యమంలో డీఈఈ సెట్‌ రాస్తే రెండు ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. 


డీఈఈ సెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో మూడు పార్ట్‌లు ఉంటాయి. మొదటి పార్ట్‌లో జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. రెండో పార్ట్‌లో జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 10, జనరల్‌ తెలుగు(తెలుగు మాధ్యమం అభ్యర్థులకు)/ జనరల్‌ ఉర్దూ(ఉర్దూ మాధ్యమం అభ్యర్థులకు) నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ఆంగ్ల మాధ్యమంలో ఎగ్జామ్‌ రాసేవారు జనరల్‌ తెలుగు/ జనరల్‌ ఉర్దూ ఎంచుకోవాల్సి ఉంటుంది. మూడో పార్ట్‌లో మేథమెటిక్స్‌ నుంచి 20, ఫిజికల్‌ సైన్సెస్‌ నుంచి 10, బయలాజికల్‌ సైన్సెస్‌ నుంచి 10, సోషల్‌ స్టడీస్‌ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. రెండో పార్ట్‌లో  జనరల్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ తెలుగు/ జనరల్‌ ఉర్దూ ప్రశ్నలను ఆ భాషల్లోనే ఇస్తారు. మిగిలిన రెండు పార్ట్‌లలో అన్ని ప్రశ్నలనూ అభ్యర్థలు ఎంచుకొన్న మాధ్యమంలో ఇస్తారు. ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. ఈ ఎగ్జామ్‌లో అర్హత పొందాలంటే జనరల్‌, బీసీ అభ్యర్థులకు కనీసం 35 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. కానీ, వీరు ఓసీ/ ఎన్‌సీసీ/ డిఫెన్స్‌ పర్సనల్‌ కేటగిరీ సీట్లకు పోటీ పడాలంటే 35 శాతం మార్కులు తప్పనిసరి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: జూలై 15 నుంచి

డీఈఈ సెట్‌ 2022 తేదీ: జూలై 23న

ఫలితాలు విడుదల: జూలై 30న

సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్స్‌, సీట్ల అలాట్‌మెంట్‌: ఆగస్టు 8 నుంచి 30 వరకు

ప్రోగ్రామ్‌లు ప్రారంభం: సెప్టెంబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: deecet.cdse.telangana.gov.in

Updated Date - 2022-05-27T23:56:56+05:30 IST